అన్వేషించండి

Petrol-Diesel Price, 31 August: పెట్రోల్, డీజిల్ ప్రైస్‌లో అనూహ్య మార్పులు, మీ ఏరియాలో రేటెంతో తెలుసా?

అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గినా, అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ 100 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Petrol Diesel Prices Today: పెట్రోలు, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటికి (మంగళవారం), ఇవాళ్టికి (బుధవారం) ధరల్లో మార్పు లేదు. మొత్తంగా చూస్తే, లీటరు పెట్రోలు ధర రూ.109-110 శ్రేణిలో, డీజిల్‌ ధర రూ.100 దిగువన ఉన్నాయి. వడ్డీ రేట్లు పెంపులో దూకుడు కొనసాగిస్తామని అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేయడంతో, ద్రవ్యోల్బణ భయం తొలగిపోలేదన్న ఆందోళనలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో కనిపించాయి. ఇంధనానికి డిమాండ్‌ తగ్గుతుందన్న అంచనాలతో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్‌ ఆయిల్‌ రేటు 2.36 శాతం తగ్గి 94.73 డాలర్ల వద్ద ఉంటే, బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.96 శాతం తగ్గి 101.98 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గినా, అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ 100 డాలర్ల వద్ద కదలాడుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశానికి ఇది ఆందోళనకర అంశం.

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana) 
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price in Hyderabad) చిన్నపాటి మార్పులు తప్ప, గత మూడు నెలలకు పైగా దాదాపుగా నిలకడగా ఉంటున్నాయి. నిన్నటితో (మంగళవారం) పోలిస్తే ఇవాళ (బుధవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా రూ.97.82 గా ఉంది. వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర నేడు రూ.109.10 గా ఉంది. డీజిల్ ధర రూ.97.29 వద్ద నిలకడగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర రూ.109.32 గా ఉండగా, లీటరు డీజిల్‌ ధర నిన్న, ఇవాళ కూడా రూ.97.50 గా కొనసాగుతోంది. 

నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు అతి స్వల్పంగా లీటరుకు రూ.0.19 పైసలు తగ్గి రూ.111.08 కి చేరింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.99.14 గా ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇంధన ధరల్లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు రూ.109.76 గా ఉండగా, ఇవాళ (బుధవారం) రూ. 0.35 పైసలు తగ్గి రూ.109.41 కి చేరింది. డీజిల్‌ ధర నిన్న రూ.99.31 కాగా, ఇవాళ రూ. 0.17 పైసలు తగ్గి రూ.99.14 గా కొనసాగుతోంది. కరీంగనర్‌లోనూ (Petrol Price in Karimnagar‌) ఇంధనం రేటులో చిన్నపాటి మార్పులు కనిపించాయి. అక్కడ నిన్న లీటరు పెట్రోలు రూ.109.76 గా ఉండగా, ఇవాళ (బుధవారం) రూ. 0.35 పైసలు తగ్గి రూ.109.41 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న రూ.97.91 గా ఉండగా ఇవాళ రూ. 0.41 పైసలు తగ్గి రూ.97.50 కి చేరింది. ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు రూ.111.83 గా ఉండగా, ఇవాళ కూడా అదే రేటు కొనసాగుతోంది. డీజిల్‌ ధర లీటరు డీజిల్‌ ధర నిన్న, ఇవాళ కూడా రూ.99.84 గా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh) 
విజయవాడ మార్కెట్‌ ఇంధన ధరలు (Petrol Price in Vijayawada) ఇవాళ కాస్త పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర నిన్నటి (మంగళవారం) రూ.111.38 నుంచి రూ. 0.24 పైసలు పెరిగి ఇవాళ (బుధవారం) రూ.111.62 కు చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ.0.23 పైసలు పెరిగి రూ.99.39 గా ఉంది. గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్నటి రూ.111.82 నుంచి రూ. 0.07 పైసలు పెరిగి ఇవాళ రూ.111.89 కి చేరింది. డీజిల్‌ ధర రూ. 0.09 పైసలు పెరిగి రూ.99.63 గా నమోదైంది. రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్నటి రూ.110.96 నుంచి రూ. 0.23 పైసలు పెరిగి రూ.111.19 గా నమోదైంది. డీజిల్‌ ధర లీటరుకు రూ. 0.21 పైసలు పెరిగి రూ.98.96 వద్దకు చేరింది.

విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర (Petrol Price in Visakhapatnam) నిన్నటితో పోలిస్తే ఇవాళ తగ్గింది. నిన్నటి కంటే ఇవాళ రూ. 0.77 పైసలు తగ్గి రూ.110.51 కి దిగివచ్చింది. డీజిల్ ధర రూ.0.71 పైసలు పెరిగి రూ.98.30 గా ఉంది. తిరుపతిలో లీటరు పెట్రోల్ ధర (Petrol Price in Tirupati) ఏకంగా రూపాయి పెరిగింది. నిన్న రూ.111.96 గా ఉంటే ఇవాళ రూ.112.66 కు చేరింది. డీజిల్ ధర రూ. 0.66 పైసలు పెరిగి రూ.100.30 గా ఉంది. కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న రూ.111.30 గా ఉంటే ఇవాళ రూ. 0.41 పైసలు పెరిగి రూ.111.71 కి చేరింది. డీజిల్ ధర రూ. 0.38 పైసలు పెరిగి రూ.99.46 వద్దకు చేరింది. అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న రూ.111.74 గా ఉంటే, ఇవాళ రూ. 0.31 పైసలు తగ్గి రూ.111.43 కి దిగి వచ్చింది. డీజిల్‌ ధర కూడా రూ. 0.29 పైసలు తగ్గి రూ.99.20 వద్ద నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Cheapest Bikes in India: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Embed widget