By: ABP Desam | Updated at : 03 Apr 2022 07:03 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా నేడు కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.91 పైసలు పెరిగి రూ.116.33గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.87 పైసలు పెరిగి రూ.102.45 గా ఉంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price) నేడు ధరలు కాస్త పెరిగాయి. నేడు (ఏప్రిల్ 3) పెట్రోల్ ధర రూ.1.08 పైసలు పెరిగి రూ.116.01 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.1.04 పైసలు పెరిగి రూ.102.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.1.37 పైసలు పెరిగి నేడు రూ.118.47 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.1.30 పైసలు పెరిగి రూ.104.43 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.1.66 పైసలు పెరిగి రూ.119.01గా ఉంది. డీజిల్ ధర రూ.1.57 పైసలు పెరిగి రూ.104.70 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో కూడా పెట్రోల్ ధర నేడు ఎగబాకింది. నేడు లీటరు ధర రూ.0.66 పైసలు పెరిగి రూ.117.52 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.0.63 పైసలు పెరిగి రూ.103.26గా అయింది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.44 పైసలు పెరిగి రూ.117.98 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.42 పైసలు పెరిగి నేడు రూ.103.68కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఏప్రిల్ 3 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 99.27 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Employees Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో స్టార్టప్! 600 మందిని తీసేసిన కార్స్ 24
Stock Market Crash: ఎరుపెక్కిన గురువారం! రూ.7 లక్షల కోట్లు నష్టం - సెన్సెక్స్ 1416 డౌన్!
Cryptocurrency Prices Today: ఆగని బిట్‌కాయిన్, ఎథీరియమ్ పతనం!
LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!