అన్వేషించండి

Petrol-Diesel Price, 20 August: హైదరాబాద్‌లో స్థిరంగా పెట్రోల్ ధర.. మిగతా నగరాల్లో తాజా ధరలు ఇలా..

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.21పైసలు తగ్గి.. రూ.97.53 కు చేరింది.

దేశంలో హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వారం రోజుల క్రితం స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్న ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి. అయితే, హైదరాబాద్‌లో మాత్రం డీజిల్ ధరలో తగ్గుదల కనిపించింది.

తెలంగాణలో ఆగస్టు 20న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.21పైసలు తగ్గి.. రూ.97.53 కు చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.27 పైసలు పెరిగింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.98గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.04 పైసలు పెరిగి రూ.97.66 గా అయింది.

ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.10 గా ఉంది. పెట్రోల్ రూ.0.17 పైసలు తగ్గగా.. డీజిల్ రూ.0.36 పైసల చొప్పున తగ్గింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.

నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.12 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.10 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.71 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.27గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటూ వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.40 చొప్పున స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.47 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.20 పైసలు తగ్గి రూ.99.60కు చేరింది.

విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ధర నిలకడగా ఉంది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.0.20 పైసలు తగ్గి రూ.98.03గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం వరకూ రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపించగా.. తాజాగా అవి స్వల్పంగా ఉంటున్నాయి.

Also Read: Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి? 

తిరుపతిలో స్వల్ప మార్పులు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజుల క్రితం వరకూ పెద్ద మార్పులు చోటు చేసుకోగా.. తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పెట్రోల్ ధరలో లీటరుకు రూ.0.47 పైసలు తగ్గింది. డీజిల్ రూ.0.60 పైసలు తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.37గా నిలకడగానే ఉండగా.. ఇక డీజిల్ ధర రూ.99.51గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 19 నాటి ధరల ప్రకారం 63.80 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

Also Read: Gold-Silver Price: పసిడి నేలచూపులు.. వెండి కూడా తగ్గుదల.. మీ నగరంలో నేటి ధరలివే..

Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget