By: ABP Desam | Updated at : 01 May 2022 07:06 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు వారాలకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) మూడు రోజుల నుంచి ధరలు నికలడగా ఉంటున్నాయి. నేడు (మే 1) పెట్రోల్ ధర రూ.119.00 గా ఉంది. డీజిల్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.46 పైసలు తగ్గి రూ.121.17 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.44 పైసలు తగ్గి రూ.107.04 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.18 పైసలు పెరిగి రూ.121.50గా ఉంది. డీజిల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.09 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. ముందు రోజు లీటరు ధర రూ.0.87 పైసలు పెరిగి రూ.120.87 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.81 పైసలు పెరిగి రూ.106.46గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.63 పైసలు పెరిగి రూ.121.48 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.55 పైసలు పెరిగి రూ.107.02కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 1 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 104.69 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
Cooking Oil Prices: గుడ్ న్యూస్! జూన్ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు
Cryptocurrency Prices: మళ్లీ నష్టాల బాటలో బిట్‌కాయిన్ - ఎంత తగ్గిందంటే?
NSE Co-location Scam: ఎన్ఎస్ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !