అన్వేషించండి

Petrol-Diesel Price, 18 April: నేడు కొన్ని చోట్ల దిగొచ్చిన ఇంధన ధర - ఈ రెండు నగరాల్లో మాత్రం స్థిరం

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది.

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు (ఏప్రిల్ 18) పెట్రోల్ ధర రూ.119.00 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.17 పైసలు తగ్గి రూ.121.32 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.16 పైసలు తగ్గి రూ.107.19 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.12 పైసలు పెరిగి రూ.121.44గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.107.04 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. నేడు లీటరు ధర రూ.0.04 పైసలు తగ్గి రూ.120.00 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.03 పైసలు పెరిగి రూ.105.65గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.1.03 పైసలు తగ్గి రూ.121.04 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.96 పైసలు తగ్గి నేడు రూ.106.61కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఏప్రిల్ 17 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 106.95 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget