అన్వేషించండి

Petrol-Diesel Price, 10 April: హైదరాబాదీలకు పెట్రోల్ ధరలో ఊరట! నేడూ నిలకడగా - ఈ నగరాల్లో భారీ పెరుగుదల

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది.

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) నేడు ధరలు తగ్గాయి. నేడు (ఏప్రిల్ 10) పెట్రోల్ ధర రూ.0.44 పైసలు తగ్గి రూ.119.00 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.42 పైసలు తగ్గి రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.40 పైసలు పెరిగి నేడు రూ.121.63 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.37 పైసలు పెరిగి రూ.107.48 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.36 పైసలు పెరిగి రూ.121.02గా ఉంది. డీజిల్ ధర రూ.0.36 పైసలు పెరిగి రూ.106.65 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో కూడా పెట్రోల్ ధర నేడు ఎగబాకింది. నేడు లీటరు ధర రూ.0.80 పైసలు పెరిగి రూ.122.08 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.0.74 పైసలు పెరిగి రూ.107.63గా అయింది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.32 పైసలు పెరిగి రూ.122.39 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.29 పైసలు పెరిగి నేడు రూ.107.86కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఏప్రిల్ 10 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 98.26 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget