By: Arun Kumar Veera | Updated at : 23 Feb 2024 02:10 PM (IST)
ఏయే పోస్టాఫీస్ పథకాలకు ఆదాయ పన్ను వర్తించదు?
TDS On Post Office Small Saving Schemes: భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా చాలా రకాల పొదుపు, పెట్టుబడి పథకాలను ప్రజలకు అందిస్తోంది. వాటిలో కొన్ని స్కీమ్స్‌లో ఆదాయంపై TDS (Tax Deducted at Source) కట్ అవుతుంది, కొన్ని స్కీమ్స్‌లో కట్ కాదు. కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపు (Income tax exemption) పరిధిలోకి రావు.
పోస్టాఫీస్ పథకంలో జరిగే లావాదేవీ మొత్తం నిర్ణీత పరిధిని మించితే టీడీఎస్ వర్తిస్తుంది. పరిమితి లోపు ఉంటే TDS కట్ కాదు. 'ఆదాయ మూలం వద్ద పన్ను తగ్గింపు'ను TDS అంటారు. ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంపై ముందుగానే ఆదాయ పన్ను వసూలు చేసే విధానం ఇది. తద్వారా, పన్ను ఎగవేతను నిరోధించవచ్చు. ముందస్తుగానే కట్ అయిన TDSను ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏయే పోస్టాఫీస్ పథకాలపై TDS కట్ అవుతుంది, వేటిపై కట్ కాదో తెలుసుకుంటే, మీ పెట్టుబడి నిర్ణయం ఇంకా ఈజీగా మారుతుంది.
TDS కట్ అయ్యే/ కట్ కాని పోస్టాఫీస్ పథకాలు:
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit)
పోస్టాఫీసు RD పథకం కింద, TDS కట్ అయ్యే పరిమితి సాధారణ పౌరులకు (60 ఏళ్ల వయస్సు లోపు వాళ్లు) రూ. 40,000. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల వయస్సున్న లేదా దాటిన వాళ్లు) పరిమితి రూ. 50,000.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద (Section 80C of Income Tax Act 1961), ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్లకు పన్ను వర్తిస్తుంది. ఈ కాల గడువు పథకాలపై సంపాదించే వడ్డీకి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (Post Office Monthly Income Scheme)
ఈ పథకం కింద వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే ఆదాయ పన్ను వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు రాదు.
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
మహిళ సమ్మాన్ సేవింగ్స్ లెటర్ స్కీమ్ కింద TDS కట్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌కు (SCSS) సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు దక్కుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిండెట్ ఫండ్ (PPF)
NSC పథకం కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై కూడా TDS వర్తించదు. PPF పథకం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకం ఆదాయ పన్ను మినహాయింపు కిందకు రాదు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తంపై TDS కట్ కాదు.
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాదార్లకు అలెర్ట్ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!