By: ABP Desam | Updated at : 04 Feb 2023 04:17 PM (IST)
Edited By: Arunmali
11 రకాల ఎల్‌ఐసీ సేవల్ని వాట్సాప్ నుంచే పొందొచ్చు
LIC WhatsApp Services: ప్రస్తుతం, ప్రజలు ఒకరికొకరు సందేశాలు పంపుకోవడానికి WhatsAppని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారు అయితే, ఎల్‌ఐసీ వాట్సాప్ సేవను (LIC WhatsApp Services) ఉపయోగించుకుని అనేక ప్రయోజనాలను ఇంట్లో కూర్చునే పొందవచ్చు. మీకు కావల్సిన సమాచారం కోసం ఎల్‌ఐసీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం లేదా ఎల్‌ఐసీ ఏజెంట్లను సంప్రదించడం లేదా ఎల్‌ఐసీ ఆఫీసులకు వెళ్లడం వంటి కాలయాపన చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది కస్టమర్ల కోసం WhatsApp సేవలను LIC ప్రారంభించింది. డిసెంబర్ 02, 2022 నుంచి ఈ తరహా మొట్టమొదటి ఇంటరాక్టివ్ సేవను కంపెనీ ప్రారంభించింది. ఈ వాట్సాప్ సేవ ద్వారా, మీ ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించిన చాలా సమాచారం , ప్రీమియం చెల్లింపు చివరి తేదీ సహా అనేక సౌకర్యాలను పొందవచ్చు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే, ఇది ఇంకా సులభం అవుతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఈ సమాచారాన్ని పొందవచ్చు.
ఎల్‌ఐసీ అందించే వాట్సాప్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, మీరు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే వినియోగదారులు LIC WhatsApp Services ప్రయోజనాన్ని పొందుతారు.
ఆన్‌లైన్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి?
స్టెప్ 1: ముందుగా, www.licindia.in ని సైట్‌లోకి వెళ్లి, “కస్టమర్ పోర్టల్”పై క్లిక్ చేయండి
స్టెప్ 2: కస్టమర్ పోర్టల్ కోసం గతంలో మీరు రిజిస్టర్ చేసుకోకుంటే, “న్యూ యూజర్” బటన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: ఈ కింది వివరాలు అందించండి:
స్టెప్ 4: యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని, అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించండి. ఇప్పుడు మీరు పోర్టల్‌లో రిజిస్టర్ అయినట్లే.
స్టెప్ 5: ఇప్పుడు "ఈ-సర్వీసెస్" ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి. ఈ-సేవలను ఉపయోగించుకునేందుకు మీ పాలసీను అక్కడ కనిపించే ఫారంలో నింపండి.
స్టెప్ 6: ఫారంను ప్రింట్ తీసి, దాని మీద సంతకం చేసి, సంతకం చేసిన ఫారాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 7: పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీని కూడా అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 8: ఎల్‌ఐసీ ఆఫీసు దానిని ధృవీకరించుకుంటుంది. మీకు ఒక రిసిప్ట్ ఈ-మెయిల్, SMS ద్వారా అందుతుంది. ఇప్పుడు మీరు ఈ-సేవలను పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లే.
స్టెప్ 9: ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 11: మీరు మళ్లీ లాగిన్ అయితే, 'బేసిక్ సర్వీసెస్' > "యాడ్ పాలసీ" ఆప్షన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 12: మీ మిగిలిన పాలసీలన్నింటినీ నమోదు చేయండి.
అంతే, వాట్సాప్ సేవలు అందుకోవడానికి మీరు సిద్ధం.
ఎల్‌ఐసీ వాట్సాప్ సర్వీసును ఎలా ఉపయోగించాలి?
ముందుగా, ఎల్‌ఐసీ వాట్సాప్ నంబర్ 897 686 2090 ను మీ స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు హాయ్ అని ఆంగ్ల అక్షరాల్లో (Hi) సందేశం పంపండి. అక్షరాలు ఇలాగే ఉండాలి, మారకూడదు.
ఆ తర్వాత క్లయింట్‌కు చాట్‌బాట్ ద్వారా 11 సర్వీస్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సర్వీస్ ఆప్షన్‌కు ఒక నంబర్ ఉంటుంది. ఏ సేవ కావాలని మీరు కోరుకుంటారో, ఆ సేవకు ఎదురుగా ఉన్న నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపితే సరి. దానికి సంబంధించిన సమాచారం తిరిగి మీకు అందుతుంది.
వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల జాబితా:
ప్రీమియం బకాయి
బోనస్ సమాచారం
పాలసీ స్థితి
మీ ప్రస్తుత పాలసీ మీద ఎంత రుణం తీసుకోవచ్చు?
రుణం తిరిగి చెల్లింపు
రుణం మీద వడ్డీ బకాయి
ప్రీమియం చెల్లింపు పత్రం
యులిప్ (ULIP) యూనిట్ల స్టేట్‌మెంట్
ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింక్‌లు
ఆప్ట్ ఇన్ /ఆప్ట్ ఔట్ సేవలు
State Bank Vs Post Office FD: ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది?
EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్ చేయండి
Bank Loan: ఆస్తి తనఖా పెట్టి లోన్ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!
Bitcoin Crash: బిట్‌కాయిన్‌లో బ్లడ్ బాత్ - 1,02,000 స్థాయికి పతనం, ఏంటి కారణం?
Gold-Silver Prices Today 23 Jan: రూ.82,000 పైనే పసిడి నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Andhra Pradesh News: ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ - ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ
Mahesh Babu : సుకుమార్ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
Meerpet News Today: మీర్‌పేట హత్య కేసులో బిగ్ ట్విస్ట్- గురుమూర్తి సెల్‌ఫోన్ చూసిన షాకైన పోలీసులు