By: Khagesh | Updated at : 18 Sep 2025 10:08 AM (IST)
ఐటీ రిటర్న్ దాఖలు చేసినా రీఫండ్ కాలేదా? ఇలా ఎందుకు జరిగిందో ఇక్కడ తెలుసుకోండి! ( Image Source : Other )
IT Return Refund : 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ ముగిసింది. సెప్టెంబర్ 15తో గడువు ముగియడంతో మంచి పెంచుతారని చాలా అంది అనుకున్నారు . కానీ కేంద్రం మరోసారి గడువు పెంచేందుకు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే రిటర్న్ దాఖలు చేసిన వారికి ఇంత వరకు రీఫండ్ కాలేదు. దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. అసలు ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందో ఇక్కడ చూద్దాం.
రీఫండ్ సకాలంలో రాకపోవడానికి వెరిఫికేషన్ అతిపెద్ద కారణం కావచ్చు. మీకు రిటర్న్ దాఖలు చేయడం మాత్రమే సరిపోదు. మీరు దానిని 30 రోజుల్లోపు ధృవీకరించాలి. ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వెరిఫికేషన్ చేయాలి. మీరు ఈ దశను మిస్ అయితే, రిటర్న్ చెల్లనిదిగా పరిగణిస్తారు. అలాంటి వాటినికి రీఫండ్ ఇవ్వరు. ఇప్పుడు ఈ అప్లికేషన్ అదే స్టేజ్‌లో ఉండి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో, రిటర్న్ అధికారులు త్వరగా వెరిఫికేషన్ చేయకపోవడం కూడా కారణం కావచ్చు. ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే రీఫండ్ నిధులు మీ ఖాతాలో వేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులు వేచి ఉండక తప్పదు. మరీ ఆలస్యమైతే పన్ను చెల్లింపుదారులు పోర్టల్‌లోకి లాగిన్ అయి “CPC-ITR” విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. ప్రక్రియను వేగవంతం చేయాలని రిక్వస్ట్ చేయవచ్చు.
మీరు తప్పు బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేసినా కూడా మీ రిటర్న్ ఫైల్ ఆలస్యం కావచ్చు. మీ రీఫండ్ రాకపోవడానికి ఇది కూడా ఒక సాధారణ కారణం కావచ్చు. దీని కోసం ఆదాయపు పన్ను శాఖ సాధారణంగా ఇమెయిల్ హెచ్చరిక పంపుతుంది. పన్ను చెల్లింపుదారులు “మై బ్యాంక్ డిటైల్స్” కింద వారి బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయాలి. ఆపై “రీఇష్యూ రీఫండ్” కోసం అభ్యర్థించాలి.
ITRలో నమోదు చేసిన TDS వివరాలు ఫారమ్ 26AS లేదా AISతో సరిపోలకుంటే కూడాా రీఫండ్ ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భంలో, పన్ను చెల్లింపుదారులు వ్యత్యాసాన్ని తొలగించడానికి CPCకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఫాలో అయితే వారం పది రోజుల్లో మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి.
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Gold Rate: బంగారం, వెండి ధరల ట్రెండ్ కొనసాగుతుందా! 2026లో ఎంత పెరుగుతుంది? నిపుణులు ఏమన్నారు?
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్ అండ్ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా