అన్వేషించండి

New Ticket Cancellation Refund Rules: రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!

New Ticket Cancellation Refund Rules: ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే రీఫండ్‌ స్లాట్లు లెక్కించే వారు. కొత్త రూల్స్ ప్రకారం దీన్ని 72 గంటలకు పొడిగించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైలు టికెట్ రద్దు, రీఫండ్ నియమాలలో మార్పులు ఏప్రిల్ 1 నుండి అమలు.
  • 72 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి మొత్తం, తక్కువ సమయం ఉంటే 50% రీఫండ్.
  • బోర్డింగ్ స్టేషన్, కౌంటర్ టికెట్ రద్దు ప్రక్రియ సులభతరం చేయబడింది.
  • ఐఆర్‌సీటీసీ దక్షిణ భారత పుణ్యక్షేత్రాలకు కొత్త పర్యాటక ప్యాకేజీ ప్రకటించింది.

New Ticket Cancellation Refund Rules: భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రైలు టికెట్ రద్దు, రీఫండ్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య దశలవారీగా అమలులోకి రానున్నాయి. 

రైల్వే టికెట్ క్యాన్సలేషన్ కోసం కొత్త రూల్స్ 

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే రీఫండ్‌ స్లాట్లు లెక్కించే వారు. అయితే కొత్త సంస్కరణల ప్రకారం ఈ సమయాన్ని 72 గంటలకు పొడిగించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలంటే సమయాన్ని బట్టి రీఫండ్‌ పొందే విధానాన్ని రైల్వేశాఖ నాలుగు విభాగాలుగా విభజించింది. 

72 గంటల ముందు 

ప్రయాణానికి 72 గంటల కంటే ముందే కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే కేవలం కనీస క్యాన్సలేషన్ ఛార్జీలు మాత్రమే మినహాయించి మిగిలిన పూర్తి మొత్తాన్ని ప్రయాణికులకు ఇచ్చేస్తారు. 

72 నుంచి 24 గంటల మధ్య 

రైలు బయల్దేరడానికి 72 గంటల ముందు నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25శాతం మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. 

24 నుంచి 8గంటల మధ్య 

ప్రయాణ సమయాన్ని 24 గంటల ముందు నుంచి 8 గంటల వ్యవధిలో రద్దు చేసుకుంటే 50శాతం మాత్రమే తిరిగి ఇస్తారు. 

8 గంటల లోపు అయితే

రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు లేదా రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు. 

బోర్డింగ్ పాయింట్, ఇతర వెసులుబాట్లు

ప్రయాణికుల అవసరాలను గుర్తించిన రైల్వే శాఖ, బోర్డింగ్ పాయింట్‌ మార్చుకునే విషయంలో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇకపై ప్రయాణానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, వంటి మెట్రో నగరాల్లో ఒకే నగర పరిధిలో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

అంతేకాకుండా, గతంలో కౌంటర్ టికెట్లను రద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఈ టికెట్‌ ప్రయాణికులకు కూడా ఒక శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ డిపాజిటర్‌ రిసీట్‌ కోసం మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిగ్‌గా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. 

ఆధ్యాత్మిక పర్యాటకం- ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ 

దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర- అరుణాచలం- చిదంబరం పేరిటో 14,500ే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా అరుణాచలం, రామేశ్వేరం, కన్యాకుమారి వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శించవచ్చు. 

Frequently Asked Questions

రైలు టికెట్ రద్దుకు సంబంధించి రీఫండ్ స్లాట్లు ఎలా లెక్కించబడతాయి?

కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు నుండి రీఫండ్ స్లాట్లు లెక్కించబడతాయి. ఇది మునుపటి 48 గంటల కంటే పొడిగించబడింది.

72 గంటల కంటే ముందు టికెట్ రద్దు చేస్తే ఎంత రీఫండ్ వస్తుంది?

రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకుంటే, కనీస క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన పూర్తి మొత్తం తిరిగి చెల్లించబడుతుంది.

రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే రీఫండ్ లభిస్తుందా?

రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు లేదా రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు.

బోర్డింగ్ స్టేషన్ ను ఎప్పటిలోగా మార్చుకోవచ్చు?

ప్రయాణికులు తమ ప్రయాణానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవచ్చు. ఇది మెట్రో నగరాల్లో ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

కౌంటర్ టికెట్లను ఎక్కడ రద్దు చేసుకోవచ్చు?

గతంలో రైలు ప్రారంభమయ్యే స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు దేశంలోని ఏ రైల్వే స్టేషన్ లోనైనా కౌంటర్ టికెట్లను రద్దు చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget