అన్వేషించండి

July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!

July 1 Rules Changes:వచ్చే జులై 1వ తేదీ నుంచి సామాన్యుల జేబుపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. రైల్వే ప్రయాణాల్లో జరిమానాలు పెరగనున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైల్వే నిబంధనలు కఠినతరం, టికెట్‌లేని ప్రయాణానికి జరిమానాలు పెంపు.
  • ఆధార్‌ వివరాల అప్‌డేట్ డిసెంబర్‌ వరకు ఉచితం, ఆర్థిక గడువులు కీలకమయ్యాయి.
  • క్రెడిట్‌ కార్డు రివార్డులు, లాంజ్‌ యాక్సెస్‌, ఇంధన ధరల్లో మార్పులు.
  • పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఛార్జీలు గణనీయంగా పెరిగాయి, జులై 1 నుండి.

July 1 Rules Changes:ప్రతి నెల ప్రారంభంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రావడం సహజం. అయితే ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. ముఖ్యంగా భారతీయ రైల్వేలు నిబంధనలు కఠినతరం చేయగా, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రజలకు ఒక వెసులుబాటు కల్పించింది. 

భారతీయ రైల్వేలో కఠిన రూల్స్‌

రైలు ప్రయాణీకులు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. జులై 1 నుంచి జన్ విశ్వాస్‌ చట్టం కింద సవరించిన రూల్స్ ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై రైల్వై శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు టికెట్ లేకుండా ప్రయాణించే వారికి కనీసం 250 రూపాయలు జరిమానా వేసేవారు. జులై 1 నుంచి దాన్ని 500 రూపాయలు చేశారు. మహిళల కోసం కేటాయించిన కోచ్‌లలో ప్రయాణించే పురుషులకు ఇకపై భారీ జరిమానా తప్పదు. వీరికి గరిష్టంగా 2500 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. జనరల్ టికెట్‌తో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణించడం, వేరొకరి పేరు మీద ఉన్న టికెట్‌పై ప్రయాణం చేయడం వంటి పనులకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాల్లో అనుమతి లేకుండా వ్యాపారం చేయడం, భిక్షాటన, బహిరంగంగా మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రమాదకర వస్తువులను రవాణా చేయడం వంటి చర్యలకు కూడా జరిమానాలు పెంచారు. 

ఆధార్ కార్డ్ అప్‌డేట్‌

ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. మీ ఆధార్‌లో ఈమెయిల్‌ అడ్రెస్‌ లేదా ఇతర డెమోగ్రాఫిక్ వివరాలు అప్‌డేట్‌ కాకపోతే జులై 1నుంచి డిసెంబ్‌ వరకు ఎలాంటి రుసుం లేకుండా మార్పులు చేసుకోవచ్చని UIDAIప్రకటించింది. గతంలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండ్, మొబైల్ నంబర్‌ , మెయిల్ అప్‌డేట్ చేయానికి 75 రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పుడు  సేవలు ఉచితంగా అందిస్తారు. 

టీడీఎస్ గడువు 

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన జులై నెల చాలా కీలకమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతభత్యాలు పొంద వ్యక్తులు, ఆడిటింగ్ అవసరం లేని వారు తమ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ సమర్పించడానికి జులై 31 ఆఖరి తేదీ. ఏప్రిల్-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి టీడీఎస్ డిపాజిట్‌ చేయడానికి జులై 7 గడువుగా నిర్ణయించారు. 

క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు 

ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లు, ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌ నిబంధనలను సవరించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెగాలియో గోల్డ్ కార్డు వినియోగదారులు ఉచితంగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్ యాక్సెస్ పొందాలంటే, మునుపటి త్రైమాసికంలో కనీసం 60వేలు ఖర్చు చేసి ఉండాలి. యెస్‌ బ్యాంక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ కోసం కనీసం ఖర్చు పరిమితిని పదివేల నుంచి 35వేలకు పెంచింది. ఇది యెస్‌ మార్క్యూ, యెస్‌ సెలెక్ట్‌ వంటి పలు కార్డులకు వర్తిస్తుంది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌ జులై నుంచి ప్రభుత్వ చెల్లింపులు, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు, వాలెట్‌ లోడ్‌లు, ఫ్యాయల్‌ కొనుగోళ్లపై రివార్డు పాయింట్లను నిలిపి వేస్తోంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జులై 15 నాటికి పూర్తి స్థాయిలో యాక్సిస్‌ బ్యాక్‌ పరిధిలోకి రానున్నాయి. అయితే కార్డ్ నెంబర్, పిన్, ఎక్స్‌పైరీ తేదీల్లో మార్పు ఉండదు. 

ఇంధన ధర సమీక్ష 

ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా జులై 1న డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. అలాగే విమాన ఇంధనం, సీఎన్జీ ధరలు కూడా మారే అవకాశం ఉంది. ఇది సామాన్యుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతుంది. 

జులై 1 పాస్‌పోర్ట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. గత 12 ఏళ్లుగా మార్పులు చేర్పులు చేయని ప్రభుత్వం ఈసారి భారీ స్థాయిలో వడ్డించింది. కొత్త ఫీజులు జులై నుంచి అమల్లోకి రానున్నాయ. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేకుంటే ఆర్థికంగా నష్టపోతారు. 

Frequently Asked Questions

జులై 1 నుండి రైల్వే నిబంధనలలో ఎలాంటి మార్పులు రానున్నాయి?

టికెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా ₹250 నుండి ₹500కి పెరిగింది. మహిళల కోచ్‌లలో ప్రయాణించే పురుషులకు ₹2500 వరకు జరిమానా, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు కూడా భారీ జరిమానాలు విధిస్తారు.

ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా ఎప్పటివరకు అప్‌డేట్ చేసుకోవచ్చు?

జులై 1 నుండి డిసెంబర్ వరకు ఈమెయిల్ లేదా ఇతర డెమోగ్రాఫిక్ వివరాలను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. గతంలో దీనికి ₹75 వసూలు చేసేవారు.

జులై 1 నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనలలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

HDFC, Yes Bank వంటి బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లు, ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ నిబంధనలను సవరించాయి. కొన్ని చెల్లింపులపై HSBC రివార్డు పాయింట్లను నిలిపివేసింది.

జులై 1 నుండి పాస్‌పోర్ట్ ఛార్జీలలో మార్పులు ఉన్నాయా?

అవును, 12 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ కొత్త ఫీజులు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget