By: ABP Desam | Updated at : 09 May 2022 10:09 PM (IST)
ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 10 క్రిప్టో కరెన్సీ ఇవే..!
క్రిప్టో కరెన్సీ అనేది ఓ ఎన్ క్రిప్టడ్ డేటా స్ట్రింగ్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. ఇదొక వర్చువల్ అండ్ ఆల్ట్రనేట్ మోడ్ ఆఫ్ కరెన్సీ. డిజిటల్ ఆస్తులను దక్కించుకోవటానికి వాడుకునే కరెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేస్తున్నవాళ్ల సంఖ్య చాలా పెరుగుతోంది. ఇండియా సహా చాలా ప్రభుత్వాలు క్రిప్టోను ఇంకా లీగలైజ్ చేయలేదు. ఇండియా అయితే రీసెంట్‌గా క్రిప్టో అండ్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను విధించింది కానీ లీగలైజ్ మాత్రం చేయలేదు. బిట్ కోయిన్, అథేరియం దగ్గర నుంచి డోష్ కోయిన్, టెథర్ వరకూ వేలకొద్దీ డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ అందుబాటులో ఉన్నాయి. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్, ప్రస్తుతం సర్క్యూలేషన్‌లో ఉన్న కాయిన్స్ వాల్యూ ఆధారంగా ఫోర్బ్స్ అడ్వెజర్ ఇచ్చిన టాప్ 10 క్రిప్టో కరెన్సీ ఏంటో చూద్దాం.
1.Bitcoin (BTC)-బిట్ కాయిన్
Market Cap: $723 Billion
Satoshi Nakamoto అనే అన్ ఐడింటిఫైడ్ పర్సన్ 2009లో బిట్ కాయిన్ క్రియేట్ చేశారని చెబుతారు. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయింది. మే 2016లో బిట్ కాయిన్‌ను 500 డాలర్లకు కొనుగోలు చేస్తే ఇప్పుడు మే1, 2022 నాటికి ఓ సింగిల్ బిట్ కాయిన్ విలువ 38 వేల డాలర్లకు చేరుకుంది. ఈ గ్రోత్ 7 వేల 500శాతం కంటే పై మాటే.
2.Ethereum(ETH)- అథేరియం
Market cap: $333 billion
దీనికున్న పొటెన్షియల్ అప్లికేషన్స్ వల్ల అథేరియం ప్రోగ్రాం డెవలపర్స్‌కు చాలా ఫేవరెట్ క్రిప్టో కరెన్సీ. బ్లాక్ చెయిన్ ప్లాట్ ఫాం పై నే పని చేసే ఈ క్రిప్టో కరెన్సీ గ్రోత్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. 2016 ఏప్రిల్ లో అథేరియం విలువ 11 డాలర్లు అదిప్పుడు ఏకంగా 2700 డాలర్లకు పెరిగిపోయింది. దాదాపుగా 25 వేల శాతం పెరిగిందన్న మాట అథేరియం విలువ.
3. Tether(USDT)-టెథర్
Market Cap: $83 Billion
మిగిలిన క్రిప్టో కరెన్సీల్లా కాకుండా టెథర్‌ను స్టేబుల్ కాయిన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీన్ని కొనుగోలు చేస్తున్న వాటిలో యూఎస్ డాలర్లు, యూరోల జరుగుతున్న మార్కెట్ చాలా ఎక్కువ. సో టెథర్ వాల్యూ... మిగిలిన క్రిప్టో కరెన్సీలతో పోల్చి చూస్తే చాలా కనిస్టెస్ట్సీని మెయిన్ టైన్ చేస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లకు ఫేవరెట్‌గా మారుతోంది.
4. Binance Coin(BNB)- బైనేన్స్ కాయిన్
Market Cap: $62 Billion
లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్ ఛేంజెస్‌లో ఒకటిగా భావించే బైనేన్స్ క్రిప్టో కరెన్సీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. 2017లో దీన్ని లాంఛ్ చేసిన తర్వాత బైనేన్స్ ఎక్స్ ఛేంజ్ ప్లాట్ ఫాంపై బైనేన్స్ కాయిన్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. ట్రేడింగ్‌లో, పేమెంట్ ప్రోసెసింగ్‌లో, ట్రావెల్ అరేంజ్‌మెంట్స్ బుకింగ్‌లోనూ బైనేన్స్ కాయిన్‌ను అంగీకరిస్తున్నారు. అథేరియం, బిట్ కాయిన్ లాంటి వేరే క్రిప్టో కరెన్సీల్లోకి బైనేన్స్ కాయిన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. 2017లో లాంఛ్ అయినప్పుడు 0.10 డాలర్లుగా ఉన్న బైనేన్స్ కాయిన్ మే 2022 నాటికి 383 డాలర్లకు చేరుకుంది. ఇది ఏకంగా 3లక్షల 50 వేల శాతం వృద్ధిని నమోదు చేసింది.
5. US Dollar Coin(USDC)- యూఎస్ డాలర్ కాయిన్
Market cap: $49 billion
టెథర్ లానే యూఎస్ డీ కాయిన్ కూడా స్టేబుల్ కాయిన్ గుర్తింపు సాధించింది. యూఎస్ డాలర్ల బ్యాకప్‌తోపాటు 1 అమెరికన్ డాలర్ విలువ 1 అమెరికన్ డాలర్ కాయిన్ కావటం అనేది అప్పట్లో దీనికున్న పెద్ద అడ్వాంటేజ్. కంప్లీట్‌గా గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ ఉపయోగపడుతుంటం యూఎస్ డాలర్ కాయిన్‌కు ఉన్న ప్రత్యేకత.
6. Solana(SOL)- సొలానా
Market cap: $29 billion
పవర్ డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అవసరాలం కోసం, డీ సెంట్రలైజ్డ్ యాప్స్ కోసం, స్మార్ట్ కాంట్రాక్ట్ అంశాల్లో ఉపయోగపడేలా సొలానా క్రిప్టోను డిజైన్ చేశారు. ప్రూఫ్ ఆఫ్ స్టేక్, ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ మెకానిజమ్స్ ఆధారంగా చాలా త్వరగా, సెక్సూర్‌గా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసేలా సొలానాను రూపొందించారు. 2020లో లాంఛ్ చేసినప్పుడు సొలానా స్టార్టింగ్ ప్రైస్ 0.77 డాలర్లు. కానీ రెండేళ్లలోనే ఇప్పుడు దాని విలువ 87 డాలర్లకు ఎగబాకింది. పదకొండువేల శాతం వృద్ధిరేటు ను సాధించింది.
7. XRP (XRP)- ఎక్స్ఆర్ పీ
Market cap: $29 billion
రిపిల్ పేరుతో డిజిటల్ టెక్నాలజీ అండ్ పేమెంట్ ప్రోసెసింగ్ కంపెనీని ప్రారంభించిన ఫౌండర్సే ఈ ఎక్స్ఆర్‌పీ క్రిప్టో కరెన్సీ ని కూడా రూపొందించారు. అన్ని రకాల క్రిప్టో కరెన్సీల్లోకి ఎక్స్ ఛేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండటం ఎక్స్ఆర్ పీ ప్రత్యేకత. 2017 లో ఎక్స్ఆర్ పీ విలువ 0.006 డాలర్లు కాగా....మే 2022 నాటికి అది 0.59 డాలర్లకు చేరుకుంది. 9వేల 800 శాతం వృద్ధిని నమోదు చేసింది.
8. Terra (LUNA)- టెర్రా(లూనా)
Market cap: $28 billion
టెర్రా కూడా ఓ బ్లాక్ చెయిన్ పేమెంట్ ప్లాట్ ఫాం. ఇది స్టేబుల్ కాయిన్స్ గా పేరు తెచ్చుకుంది. టెర్రా యూసీఎడీ లాంటివి బయటి ఫిజికల్ కరెన్సీ విలువకు సమానంగా ఉండటం..ఆ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయటం ద్వారా కన్ సిస్టెటెన్సీ ని కాపాడుకోగలుగుతోంది టెర్రా. దీనికి కౌంటర్ వెయిట్ లా..... లూనా అనే కాయిన్ కూడా టెర్రాను ప్రత్యేకంగా నిలుపుతోంది. సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా టెర్రా, లూనా రెండూ పని చేస్తుంటాయి. టెర్రా స్టేబుల్ కాయిన్ ప్రైసెస్ కనుక బాగా రైజ్ అయితే....
ల్యూనా బర్న్ చేసుకోవటం ద్వారా టెర్రా స్టేబుల్ కాయిన్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సేమ్ వైస్ వర్సా. సో ఇలాంటి ఓ ఫీచర్ ఉండటం టెర్రా ను యూనిక్ గా నిలబెడుతోంది. జనవరి 2021 లో టెర్రా విలువ 0.64 డాలర్లు ఉంటే మే 2022 నాటికి 80 డాలర్లకు చేరుకుంది. ఇది దాదాపు 12 వేల 400 శాతం ఎక్కువ.
9. Cardano (ADA)_కార్డానో(ఏడీఏ)
Market cap: $26 billion
అథేరియం లానే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎనేబుల్ చేయటం, డీ సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ద్వారా కార్డానో పని చేస్తూ ఉంటుంది. ADA అనేది కార్డానో కు నేటివ్ కాయిన్. ఇతర మేజర్ క్రిప్టో కాయిన్స్ లానే కార్డానో ఏడీఏ కూడా మంచి గ్రోత్ రేట్ ను చూపించింది . 2017 లో 0.02 డాలర్లుగా ఉన్న దీని విలువ 2022 నాటికి 0.77 డాలర్లకు చేరుకుంది. ఇది మొత్తం 3 వేల 750 శాతం ఎక్కువ.
10. TerraUSD (UST)- టెర్రా యూఎస్ డీ
Market cap: $19 billion
బిట్రెక్స్ తో పార్టనర్ షిప్ ద్వారా 2020లో లాంచ్ అయ్యింది టెర్రా యూఎస్ డీ. యూఎస్ డాలర్ల ట్రేడింగ్ ద్వారా ఇది కూడా స్టేబుల్ కాయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొరియాకు చెందిన స్టేబుల్ కాయిన్ టెర్రాKRW ను టెర్రా యూఎస్ డీ సపోర్ట్ చేస్తోంది. టెర్రా కేఆర్ డబ్ల్యూ అనేది టెర్రా యూఎస్ డీ కంటే ముందే లాంచ్ అయ్యింది. అథేరియం, సొలానా బ్లాక్ చెయిన్ టెక్నాలజీస్ లో టెర్రా యూఎస్ డీ కి ఎక్స్ చేంజ్ చేసుకునే సౌలభ్యం ఉంది.
సో ఇవి ఫోర్బ్స్ అడ్వైజర్ ప్రకారం టాప్ టెన్ క్రిప్టో కరెన్సీస్. కానీ గుర్తు పెట్టుకోండి క్రిప్టో కరెన్సీ ఇండియాలో ఇంకా లీగలైజ్ కాదు రెండోది క్రిప్టో కరెన్సీ తో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కేవలం క్రిప్టో కరెన్సీ మీద అవగాహన కోసమే
Retirement Corpus: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!
HDFC Bank: మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
Gold-Silver Prices Today 08 Jan: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PVC Aadhaar Card: క్రెడిట్ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్ కార్డ్ - ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయొచ్చు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech : చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా