search
×

EPFO Complaints::మీ ఈపీఎఫ్ ఖాతాలో స‌మ‌స్యలా, ఇలా ఫిర్యాదు చేయండి  

ఈపీఎఫ్ న‌గ‌దు ఉపంసంహ‌ర‌ణ‌, ఈపీఎఫ్ ఖాతా బ‌దిలీ సంబంధిత విష‌యాలు, కేవైసీ లాంటి విష‌యాల‌లో ఏమైనా స‌మ‌స్య త‌లెత్తుతున్నాయా? అయితే ఈ కథనం చదివేయండి..

FOLLOW US: 
Share:

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు ప్రైవేట్ ఉద్యోగుల‌కు సైతం ఈపీఎఫ్ఓ ఖాతాలు ఉంటాయి. దేశ‌వ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి ఏదైనా స‌మ‌స్య త‌లెత్తితే ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు. సులువుగా ఫిర్యాదు చేసుకునే వెస‌లుబాటును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (EPFO) క‌ల్పించింది. ఈపీఎఫ్ న‌గ‌దు ఉపంసంహ‌ర‌ణ‌, ఈపీఎఫ్ ఖాతా బ‌దిలీ సంబంధిత విష‌యాలు, కేవైసీ లాంటి విష‌యాల‌లో ఏమైనా స‌మ‌స్య త‌లెత్తితే ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఈపీఎఫ్ఓ ట్విట్ట‌ర్ ఖాతా @socialepfoకు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. లేదా మీకు కావ‌ల‌సిన స‌మాచారాన్ని ఖాతాదారులు అడ‌గి పొంద‌వ‌చ్చు.

పీఎఫ్ సంబంధిత ఫిర్యాదులు చేసే విధానం

  • మొద‌ట‌గా అధికారిక వెబ్‌సైట్ https://epfigms.gov.in/  లింక్ చేయాలి
  • ఫిర్యాదు చేయ‌డానికి రిజిస్ట‌ర్ గ్రీవ‌న్స్ (Register Grievance) మీద క్లిక్ చేయండి
  • ఓ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఏ విభాగంలో ఫిర్యాదు చేయాలో ఆ సెక్ష‌న్ మీద క్లిక్ ఇవ్వండి. పీఎఫ్ మెంబ‌ర్, ఈపీఎస్ పెన్ష‌న‌ర్, ఎంప్లాయ‌ర్, త‌దిత‌ర వివ‌రాలు క‌నిపిస్తాయి. యూఏఎన్ లేదా పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ మీతో లేక‌పోతే ఇత‌రులు (Others) ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి.
  • పీఎఫ్ సంబంధిత ఫిర్యాదులకు పీఎఫ్ మెంబ‌ర్ స్టేట‌స్ సెల‌క్ట్ చేయాలి. త‌రువాత యూఏఎన్, సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి గెట్ డీటైల్స్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.
  • యూఏఎన్‌కు రిజిస్ట‌ర్ అయిన అన్ని వివ‌రాలు స్క్రీన్ మీద క‌నిపిస్తాయి.
  • గెట్ ఓటీపీ (Get OTP) మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట‌ర్ మొబైల్‌కు వ‌న్‌టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది.
  • ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌రువాత వ్య‌క్తిగ‌త వివ‌రాలు అడుగుతుంది.
  • వ్య‌క్తిగ‌త వివ‌రాలు న‌మోదు చేసిన అనంత‌రం పీఎఫ్ నెంబ‌ర్ మీద క్లిక్ చేస్తే ఫిర్యాదు న‌మోదు అవుతుంది.
  • స్క్రీన్ మీద ఓ పాప్ అప్ క‌నిపిస్తుంది. మీరు ఫిర్యాదు చేయాల‌నుకున్న విభాగంపై క్లిక్ చేయాలి.
  • గ్రీవ‌న్స్ కేట‌గిరీని ఎంపిక చేసి ఫిర్యాదు వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. మీతో ఏవైనా ఆధారాలు ఉంటే అప్‌లోడ్ చేయండి.
  • ఫిర్యాదు న‌మోదైన త‌రువాత యాడ్ (Add) బ‌ట‌న్ మీద క్లిక్ చేసి స‌బ్మిట్ చేయాలి.
  • మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్‌కు, మెయిల్ ఐడీకి కంప్లైంట్ ఐడీ లేదా కంప్లైంట్ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ వ‌స్తుంది. 

 మీ కంప్లైంట్ స్టేట‌స్ ఇలా చెక్ చేయండి

మీరు ఈపీఎఫ్ఓలో న‌మోదు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవ‌డానికి ఈజీ స్టెప్స్ పాటిస్తే చాలు

  • మొద‌ట‌గా ఈపీఎఫ్ఓ గ్రీవ‌న్స్ వెబ్ పేజీ https://epfigms.gov.in/ కు వెళ్లాలి
  • వ్యూ స్టేట‌స్ మీద క్లిక్ ఇవ్వండి.
  • మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్‌కు వ‌చ్చిన కంప్లైంట్ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ మ‌రియు సెక్యూరిటీ కోడ్ న‌మోదు చేయాలి.
  • మీ స్క్రీన్ మీద ఫిర్యాదు స్టేటస్ వివ‌రాలు కనిపిస్తాయి. ఏ ఈపీఎఫ్ఓ కార్యాల‌యంలో మీ కంప్లైంట్ మీద చ‌ర్య తీసుకుంటార‌న్న వివ‌రాలు సైతం అందిస్తుంది
Published at : 27 Jul 2021 07:40 PM (IST) Tags: EPFO PF Account EPF Complaint Status EPF EPFO Latest News EPFO Grievance

ఇవి కూడా చూడండి

Bajaj Finance Digital FD: బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీల గురించి తెలుసా? భద్రతకి భద్రత లాభానికి లాభం

Bajaj Finance Digital FD: బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీల గురించి తెలుసా? భద్రతకి భద్రత లాభానికి లాభం

Bajaj Finance Insta Personal Loan: అత్యవసర ఖర్చులున్నాయా, అయితే బజాజ్‌ ఫైనాన్స్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ తీసుకోండి

Bajaj Finance Insta Personal Loan: అత్యవసర ఖర్చులున్నాయా, అయితే బజాజ్‌ ఫైనాన్స్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ తీసుకోండి

Latest Gold-Silver Prices Today: మళ్లీ రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు కొత్త ఇవి

Latest Gold-Silver Prices Today: మళ్లీ రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు కొత్త ఇవి

Gold-Silver Prices Today: గోల్డ్ మంట మామూలుగా లేదు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: గోల్డ్ మంట మామూలుగా లేదు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

SBI Debit Card Charges: ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!

SBI Debit Card Charges: ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!

టాప్ స్టోరీస్

Hindupuram Politics : కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?