By: ABP Desam | Updated at : 05 Feb 2025 02:31 PM (IST)
ఈ-వే బిల్ రద్దు కొరకు 6 ఆవశ్యక చిట్కాలు ( Image Source : Other )
ఈ-వే బిల్స్ అనేవి భారతదేశవ్యాప్తంగా వస్తువుల రవాణా వివరాలను రికార్డ్ చేసే డిజిటల్ డాక్యుమెంట్స్. ఏప్రిల్ 2018 లో అమలుచేయబడి ఈ-వే బిల్స్, ముందుగా-ఉన్న రవాణా పాస్ వ్యవస్థ స్థానములో వచ్చాయి. ఇవి దేశములో ఒక ఏకీకృత ప్రక్రియ మరియు కాగితం రహిత స్వభావముతో వస్తువులు & సేవల పన్ను (జిఎస్టి) విధానము అమలుకు విలువను చేర్చాయి.
రూ. 50,000 కంటే ఎక్కువ విలువ ఉన్న వస్తువుల రవాణా కొరకు ఈ-వే బిల్స్ తప్పనిసరి మరియు అందుచేత మీరు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో వస్తువులు లేదా పని యొక్క అమ్మకాలు లేదా రవణాకు సంబంధించిన వ్యాపార యజమాని అయితే, ఈ డాక్యుమెంట్స్ గురించి మీరు తెలుసుకోవడం చాలా మంచిది. వీటిల్లో ముఖ్యమైనది ఈ-వే బిల్స్ రద్దుకు సంబంధించినది. ఈ-వే బిల్స్ రద్దుచేసేటప్పుడు
మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని అవసరమైన చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. రద్దు కొరకు ఉన్న సమయాన్ని అర్థంచేసుకోండి
ఈ-వే బిల్స్ రద్దు విషయానికి వస్తే మీరు దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశం మీరు ఈ-వే బిల్ ను రద్దు చేయుటకు మీకు ఉన్న 24 గంటల సమయ పరిమితి. నిర్దిష్ట సమయములో రద్దు చేయకపోతే, ఈ-వే బిల్ చెలామణిలో ఉంటుంది, తద్వారా అది ఆడిట్ లేదా తనిఖీ సమయములో జరిమానాలు విధించబడే అవకాశానికి దారితీయవచ్చు. రద్దు చేయుటకు చివరితేది ముగిసిపోవటానికి కారణమయ్యే సాంకేతిక ఇబ్బందులు మరియు/లేదా పోర్టల్ డౌన్‌టైమ్ నివారించుటకు ఒక ఈ-వే బిల్ ను రద్దు చేయటానికి మీరు ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకూడదు.
2. రద్దు చేయటానికి ముందు వివరాలను ధృవీకరించుకోండి
రద్దు చేయటానికి ముందు మీరు ఈ-వే బిల్ వివరాలను ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నారని నిర్ధారించుకోండి. దీని వలన మీరు అనుకోకుండా తప్పు ఈ-వే బిల్ ను రద్దు చేయకుండా ఉంటారు. ఒకవేళ మీరు తప్పు ఈ-వే బిల్ ను రద్దు చేస్తే, అది డాక్యుమెంటేషన్ మరియు అసలు రవాణా వివరాల మధ్య అసమతుల్యతకు దారి తీయవచ్చు. దానితో మీ వ్యాపారముపై అనవసరమైన పరిశీలన జరగవచ్చు. ఒకసారి ఈ-వే బిల్ రద్దు చేయబడితే, అది తిరిగి ధృవీకరించబడదు అని మరియు ఒకవేళ ఇలాంటి పరిస్థితి సంభవిస్తే మీరు ఒక తాజా ఈ-వే బిల్ జనరేట్ చేయవలసి ఉంటుందని దయచేసి గుర్తుంచుకోండి.
3. వాటాదారులందరితో సమన్వయపరచుకోండి
మీరు ఒక ఈ-వే బిల్ ను రద్దుచేసేటప్పుడు, వాటాదారులందరికి రద్దు గురించి తెలియజేయడం మరచిపోవద్దు – ముఖ్యంగా రవాణాదారులకు. ఇలా చేయకపోతే, వస్తువులు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ లేకుండానే షిప్పింగ్ చేయబడవచ్చు. ఇది ప్రయాణములో అగిపోవడము మరియు జరిమానాలకు దారితీయవచ్చు.
4. రద్దు కొరకు సరైన కారణాన్ని ఎంటర్ చేయండి
జిఎస్టి పోర్టల్ పై ఒక ఈ-వే బిల్ ను రద్దుచేసేటప్పుడు, మీరు రద్దు కొరకు ఒక కారణాన్ని అందించాలి. రికార్డులు పారదర్శకంగా ఉండటానికి మరియు ఆడిట్స్ సమయములో సమస్యలు రాకుండా ఉండటానికి సరైన కారణాన్ని ఎంపికచేయడం ముఖ్యం. రద్దు ఒక ఆర్డర్ రద్దు, తప్పు డేటా ఎంట్రీ లేదా షిప్మెంట్ ప్లానస్ లో మార్పులలో ఏ కారణం చేత అయినా జరిగితే, సంభావ్య తనిఖీని నివారించుటకు కారణాన్ని ఖచ్ఛితంగా పేర్కొనాలి.
5. పోర్టల్ పై రద్దును ధృవీకరించండి
రద్దు కోసం సబ్మిట్ చేసిన తరువాత, ప్రక్రియ పూర్తి అయిందని అనుకోకండి. ఈ-వే బిల్ స్థితి ‘రద్దుచేయబడింది” అని అప్డేట్ చేయబడిందని జిఎస్టి పోర్టల్ పై ధృవీకరించుకోండి. తనిఖీలు లేదా ఆడిట్స్ సమయములో ఏ క్రియాశీలక ఈ-వే బిల్లు కూడా పాటించబడనివిగా గుర్తించబడనివిగా లేవని నిర్ధారించుకొనుటకు ఈ ధృవీకరణ కీలకమైనది. ఈ చర్య మీ వ్యాపారముపై ఎలాంటి జరిమానాలు విధించబడకుండా రక్షిస్తుంది మరియు ఒక మంచి నిబద్ధత రికార్డును నిర్వహించుటకు
సహాయపడుతుంది.
6. ఈ-వే బిల్స్ రద్దుల గురించి రికార్డు నిర్వహించండి
రద్దుకు కారణము మరియు జిఎస్టి పోర్టల్ నుండి ధృవీకరణలతో సహా అన్ని రద్దుల గురించి ఒక లాగ్ నిర్వహించండి. ఈ రికార్డులు ఆడిట్స్ సమయములో అమూల్యమైనవి మరియు అమలుకు రుజువుగా మరియు ఈ-వే బిల్స్ నిర్వహణలో డ్యూ డిలిజెన్స్ గా పనిచేస్తాయి. సరిగ్గా నిర్వహించబడే రికార్డులు ఆడిట్ ప్రక్రియను సులభతరం చేస్తాయి మరియు పన్ను అధికారులు ప్రశ్నిస్తే అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా అందుబాటులో ఉందని మనశ్శాంతిని అందిస్తాయి.
ముగింపు
ఈ-వే బిల్స్ ను ఎలా రద్దు చేయాలి అనేది సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది జిఎస్టికి కట్టుబడి ఉంటూనే లాజిస్టిక్స్ సరిగ్గా నిర్వహించడములో ఒక అంతర్గత భాగము. ఈ ఆరు చిట్కాలను అనుసరించడం, ఈ-వే బిల్స్ రద్దుచేసే విషయములో సాధారణంగా జరిగే తప్పులను తగ్గించుటలో సహాయపడుతుంది. మీ వ్యాపారము తనిఖీ మరియు జరిమానాల రహితంగా ఉందని ఈ చర్య నిర్ధారించగలదు, తద్వారా బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలు వంటి సంస్థల నుండి ఫైనాన్సింగ్ ను సురక్షితం చేయటాన్ని సులభం చేస్తుంది.
This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Gold Rate: బంగారం, వెండి ధరల ట్రెండ్ కొనసాగుతుందా! 2026లో ఎంత పెరుగుతుంది? నిపుణులు ఏమన్నారు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్