OTT Apps: జియో, ఐడియా వొడాఫోన్‌కు షాకిచ్చిన కేంద్రం, వాట్సప్, టెలిగ్రామ్‌కు రిలీఫ్
టెలికాం బిల్లులో టెలికమ్యూనికేషన్ సేవల జాబితా నుంచి OTT ప్లేయర్‌లు, యాప్‌లను ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుంది.
OTT Apps: టెలికాం బిల్లులో టెలికమ్యూనికేషన్ సేవల జాబితా నుంచి OTT ప్లేయర్‌లు, యాప్‌లను ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శాటిలైట్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను పరిపాలనాపరమైన కేటాయింపులను ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఎలన్ మస్క్ స్టార్‌లింక్, భారతి గ్రూప్ మద్దతుగల వన్‌వెబ్, అమెజాన్ కంపెనీలకు ఇది పెద్ద విజయం అని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఈ బిల్లుకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టబడుతుందో తెలియదు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముసాయిదా బిల్లును విడుదల చేసి ప్రజల సంప్రదింపుల కోసం ఉంచారు. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించడంపై పునరాలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం క్రింద ఉన్న నిర్వచనం సరిపోతుందని, కొత్త బిల్లులో ప్రత్యేకంగా OTTని పెట్టాల్సిన అవసరం లేదని నమ్ముతున్నారు.
టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం, "టెలిగ్రాఫ్" అంటే సంకేతాలు, రచన, చిత్రాలు, శబ్దాలు, అయస్కాంత ఉద్గారాలు, రేడియో తరంగాలు, వైర్, విజువల్, ఇతర ఎలక్ట్రో ద్వారా ఏదైనా ప్రసారం చేయడానికి, స్వీకరించడానికి ఉపయోగించగల ఉపకరణం, పరికరం, మెటీరియల్ అని అర్థం. ప్రస్తుత నిర్వచనం టెలికాం నెట్‌వర్క్‌లో జరిగే అన్ని రకాల కమ్యూనికేషన్‌లను కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం OTT యాప్‌లను నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే అధికారం ఉందని, కానీ అది తన అధికారాలను వినియోగించుకోవడం లేదని, ప్రస్తుతం ఉద్దేశ్యం నియంత్రించడం కాదని, అవసరమైతే, భవిష్యత్తులో దీనిని పరిశీలించచ్చని అధికారి తెలిపారు.
అసలు ముసాయిదా బిల్లులో టెలికమ్యూనికేషన్ సేవలలో భాగంగా ప్రసార సేవలను చేర్చడంపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్), ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి పరిశ్రమ సంస్థలు కూడా కంటెంట్, ప్రసారాన్ని టెలికాం బిల్లు పరిధికి వెలుపల ఉంచాలని డిమాండ్ చేశాయి. శాటిలైట్ స్పెక్ట్రమ్ సమస్యపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వంలో విస్తృత ఆదేశం పరిపాలనా కేటాయింపులకు అనుకూలంగా ఉందని చెప్పారు. అయితే, పరిశ్రమ, ఇతర వాటాదారులను కలిసిన తర్వాత కేటాయింపుకు సంబంధించిన నియమాలు, నిబంధనలను నిర్వచించే ప్రక్రియను DoT చేపడుతుంది.
కొత్త టెలికాం బిల్లు పార్లమెంటు ఆమోదించినప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం-1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం-1950 మూడు చట్టాలను భర్తీ చేయడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాలను తగ్గించడం, ప్రసార మంత్రిత్వ శాఖతో పొటెన్షియల్ డొమైన్ పెంచడం వంటి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. ట్రాయ్ కూడా OTT కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించేందుకు సంప్రదింపుల ప్రక్రియను చేపడుతోందని, రెగ్యులేటర్ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial