News
News
X

Offline Digital Payments: ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులు షురూ, మొబైల్‌ నెట్‌వర్క్ లేకపోయినా పే చేయొచ్చు

మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా, HDFC బ్యాంక్ ఆఫ్‌లైన్ పే కింద కస్టమర్‌లు & వ్యాపారులు చెల్లింపులు చేయగలరు & చెల్లింపులను స్వీకరించగలరు.

FOLLOW US: 
Share:

HDFC Bank Offline Digital Payments: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని ప్రారంభించింది. తొలుత, పైలట్ ప్రాజెక్ట్‌ ఈ ఫెసిలటీని ప్రారంభించింది.       

క్రంచ్‌ఫిష్‌ (Crunchfish) కంపెనీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ప్రయోగం చేస్తోంది. ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్స్‌లో భాగంగా వ్యాపారులు & వినియోగదార్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. ఆర్‌బీఐ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం (RBI Regulatory Sandbox Program) కింద ఈ ఆఫ్‌లైన్ పే ప్రారంభమైంది.

మొబైల్‌లో నెట్‌వర్క్ లేకపోయినా ఇబ్బంది ఉండదు              
మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా, HDFC బ్యాంక్ ఆఫ్‌లైన్ పే కింద అటు కస్టమర్‌లు & ఇటు వ్యాపారులు చెల్లింపులు చేయగలరు & చెల్లింపులను స్వీకరించగలరు. 

మన దేశంలో ఆఫ్‌లైన్ మోడ్‌లో డిజిటల్ చెల్లింపుల పరిష్కారాన్ని ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా HDFC బ్యాంక్ ఇప్పుడు అవతరించింది. మొబైల్ నెట్‌వర్క్ తక్కువగా ఉన్నప్పటికీ HDFC బ్యాంక్ ఆఫ్‌లైన్ పే సౌకర్యంతో ఇబ్బంది ఉండదు. మొబైల్‌ నెట్‌వర్క్‌ బలహీనంగా ఉండే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ ఈ విధానం ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

నెట్‌వర్క్ బ్లైండ్ స్పాట్‌లలో పనికొస్తుంది                        
మొబైల్ నెట్‌వర్క్‌ రద్దీ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. భారీ పబ్లిక్ ఈవెంట్‌లు, ట్రేడ్ ఫెయిర్స్‌, ఎగ్జిబిషన్లలోనూ నగదు రహిత చెల్లింపులను ఆఫ్‌లైన్‌ పే కింద సులభంగా చేయవచ్చు. అదే విధంగా, సిగ్నల్స్‌ వీక్‌గా ఉండే భూగర్భ మెట్రో స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, నెట్‌వర్క్ బ్లైండ్ స్పాట్‌లు అయిన రిటైల్ స్టోర్లలో లావాదేవీలు సులభంగా చేయవచ్చు. విమానాలు, రైళ్లు లేదా నౌకల్లో కూడా నెట్‌వర్క్ లేకుండా చెల్లింపు చేయవచ్చు. ఈ రకమైన చెల్లింపుల విధానంలో, RBI రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన మొదటి డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్‌ ఇది.               

RBI శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద, బ్యాంక్‌ రెగ్యులేటర్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ మీద HDFC బ్యాంక్ గట్టిగా పని చేస్తోంది. RBI ద్వారా, Crunchfish భాగస్వామ్యంతో 2022 సెప్టెంబర్ నెలలో HDFC బ్యాంక్‌కు చెందిన ఈ ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేశారు. RBI నుంచి ఇది గ్రీన్ సిగ్నల్ పొందింది, తద్వారా దీనిని రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. క్రంచ్ ఫిష్ డిజిటల్ క్యాష్ AB అనేది నాస్‌డాక్‌లో లిస్టయిన క్రంచ్ ఫిష్ ABకి చెందిన అనుబంధ సంస్థ.               

HDFC బ్యాంక్ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశంలో ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

Published at : 16 Feb 2023 03:23 PM (IST) Tags: HDFC bank Offline digital payments RBI Regulatory Sandbox Program Crunchfish AB

సంబంధిత కథనాలు

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Stock Market: వచ్చే వారంలో 3 రోజులే ట్రేడింగ్‌, 4 రోజులు సెలవులు

Stock Market: వచ్చే వారంలో 3 రోజులే ట్రేడింగ్‌, 4 రోజులు సెలవులు

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

MSSC Scheme: ప్రారంభమైన ఉమెన్‌ స్పెషల్ స్కీమ్‌, పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి

MSSC Scheme: ప్రారంభమైన ఉమెన్‌ స్పెషల్ స్కీమ్‌, పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు