Indians : కోట్లు సంపాదించే ఇండియన్స్ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నారు - ఎలా సంపాదిస్తున్నారంటే ?
Indians income : భారత్‌లో పది కోట్లు ఆ పైన సంపాదించేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోదంది. ఒక్క ఏడాదిలో అరవై మూడు శాతం పెరిగారు. అలాగే పన్ను కట్టే వారిలో భారీగా ఆదాయాలు పెంచుకుంటన్నారు.
Indians earning Rs 10 crore annually sees a staggering 63 percent rise : భారత్‌లో ఆదాయపు పన్ను కట్టే వారి సంఖ్య అతి తక్కువ అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. పరోక్ష పన్నల రూపంలో ప్రతి ఒక్కరూ పన్నులు కడుతూనే ఉంటారు. అయితే ఆదాయపు పన్ను కట్టే రేంజ్ లో ఉన్న భారతీయుల సంఖ్య స్వల్పమే. రెండు నుంచి మూడు శాతం మందే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ పన్నులు కట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతే కాదు.. పన్నులు కడుతున్న వారి ఆదాయాలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి.
అధిక అదాయ వర్గాలు పెరుగుతున్నట్లుగా గుర్తించిన నివేదిక
ఏటా రూ. పది కోట్లు అంత కంటే ఎక్కువ సంపాదించే వారు భారత్ లో విపరీతంగా పెరుగుతున్నారు. గత ఏడాదిలో పోలిస్తే ఏకంగా 63శాతం పెరిగారని తాజా అధ్యయనం వెల్లడించింది. సెంట్రల్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ అనే సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం భారతీయల్లో పది కోట్లకుపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య గత ఆర్థిత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం భారీగా పెరిగింది. అరవై శాతం పెరగడం.. దేశ సంపదపెరుగుతోందనడానికి సూచికగా చెబుతున్నారు. ఈ ఆదాయం కేవలం ఇండివిడ్యువల్ గా సంపాదించేదే. కంపెనీలతో.. వ్యాపారాలతో సంపాదించేది కాదు.
లైట్ స్విచ్చాన్ చేసే ఉద్యోగం - ఏటా రూ.30 కోట్ల జీతం - ఇప్పటికీ ఖాళీ ఉంది ట్రై చేస్తారా ?
పదిలక్షల మందికిపైగా రూ. 50 లక్షలకుపైగా జీతాలు
అంతే కాదు.. ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకూ ఏటా సంపాదిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది.దాదాపుగా 49 శాతం పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది. ఈ ఆదాయ వృద్ది కేవలం ఉన్నత స్థాయిలో లేదని అన్ని విభాగాల్లో ఉందని రీసెర్చ్ తేల్చింది. ఏటా రూ. యాభై లక్షలు అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు దేశంలో కనీసం పది లక్షల మంది ఉంటారని అంచనా. ఇలాంటి వారి వృధ్దిరేటు పాతిక శాతంగా నమోదవుతోంది.
ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్..? ట్రంప్ ని ఎందుకు చంపాలనుకున్నాడు..?
వెల్త్ మేనేజ్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం
దేశంలో ఇలా సంపాదన పరులు పెరుగుతున్నప్పటికి వెల్త్ మెనేజ్‌మెంట్ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని రిపోర్టు అంచనా వేసింది. కేవలం పాతిక శాతం మంది మాత్రమే వెల్త్ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టారని మిగతా తమ సంపద అంతా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని అంచనా వేస్తున్నారు. భారత్ లో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ దగ్గర కలిపి మొత్తం 1.2 ట్రలియన్ డాలర్ల సంపదం ఉంటుందని అంచనా వేశారు. 2028 నాటికి ఇది 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు.
ఈ రిపోర్టు భారత్ లో ఆర్థిక ప్రగతిని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తోంది. అన్ని వర్గాల ప్రజలతూ ఆదాయాలను పెంచుకుంటున్నారని స్పష్టమవుతోంది.