30 Crore JOB : లైట్ స్విచ్చాన్ చేసే ఉద్యోగం - ఏటా రూ.30 కోట్ల జీతం - ఇప్పటికీ ఖాళీ ఉంది ట్రై చేస్తారా ?
Viral News : ప్రపంచంలో చాలా విచిత్రమైన ఉద్యోగాలుంటాయి. అందులో ఇది ఒకటి. కేవలం లైట్ ఆగిపోకుండా కాపలా కాసే ఉద్యోగం. జీతం రూ. 30 కోట్లు. కానీ ఒక్కరూ కూడా ఆసక్తి చూపించడం లేదు.
Earn 30 Crores Just by Switching a Light On Off Job : ఏటా రూ. 30 కోట్ల జీతం అంటే...ఏ పని చేయడానికైనా సిద్ధమనేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఉద్యోగం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చాలా మంది ఆశతో వస్తారు కానీ.. భయంతో పారిపోతున్నారు. అలాగని వారిని అడవుల్లో వదిలి పెట్టరు. కానీ సమద్రంలో వదిలి పెడతారు. అక్కడే ఉంది ట్విస్ట్.
ఈజిప్ట్ సముద్ర తీరంలో పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలో ఫారోస్ లైట్ హౌస్ ఉంది. ఇందులో లైట్ ను ఎప్పుడూ ఆగిపోకుండా చూసుకునేందుకు ఓ ఉద్యోగి కావాలి. లైట్ ఎప్పుడూ ఆన్‌లో ఉండటం చాలా ముఖ్యం.ఆ పని చూసుకుంటూ లైట్ హౌస్ లో ఉండాలి. అంతకు మించి మరేపని ఉండదు. ఎవరూ ఫోన్లు చేయరు.. ఫలానాపని చేయమని ఒత్తిడి చేయరు. జీతం రూ. ముఫ్పై కోట్లు ఏడాదికి ఇస్తారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి ఉద్యోగి ఎవరూ ముందుకు రాలేదు. దీనికి కారణం ఆ లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉంటుంది. అలలు ఎగసి పడుతూ ఉంటాయి. మాట్లాడేందుకు కూడా ఎవరూ ఉండరు.
అంతా బాగుందన్నారు.. అంతలోనే ఘోరం, టైటాన్ సబ్‌మెరైన్ ఆఖరి మజిలీపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి!
పగలు, తేడా లేకుండా లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకోవడం ఒక్కే ఆ ఉద్యోగి బాధ్యత. ఆ లైట్ హౌస్ అత్యంత కీలకం. ఎందుకంటే సముద్రంలో నౌకలు అటు వైపు రాకండా హెచ్చరికలు జారీ చేందుకు ఆ లైట్ హౌస్ ను ఏర్పాటు చేశారు. అటు ఎందుకు రాకూడదంటే.. సముద్రంలో అటు వైపు పెద్ద ఎత్తున రాళ్లు ఉంటాయి. వాటిని తగిలి నౌకలు డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే రూట్ ఇటు కాదు అని చెప్పడానికి ఆ లైట్ ఎప్పుడూ ఆన్ లో ఉండాలి. అందుకే ఆ లైట్ హౌస్ ను అక్కడ నిర్మించారు. లైట్ హౌస్ నిర్మించిన ప్రాంతంలో అలలు కూడా ఎక్కువగా వస్తూంటాయి. ఒక్కోసారి ఆ లైట్ హౌస్ మునిగిపోతుంది కూడా.
లైట్ హౌస్ నీళ్లలో మునిగిపోతే ఎలాగోలా బయటపడవచ్చు కానీ.. భయంతో చచ్చిపోతామన్న ఉద్దేశంతో ఎంతో మంది వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ఉద్యోగం ఖాళీగానే ఉంది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇప్పుడా లైట్ లైస్ లో లైట్ ను వెలుగుతూనే ఉండేలా చూసుకుంటున్నరు. ఈ లైట్ హౌస్ నిర్మాణం కూడా ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు. దీనిని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చెక్కతో పాటు రాయి. మెటల్ ను వినియోగించారు.
ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్..? ట్రంప్ ని ఎందుకు చంపాలనుకున్నాడు..?
మరి లైట్ ఎలా ఉంటుంది.. కరెంట్ అయితే ఒడ్డునే ఉండి స్విచ్చాన్ చేసుకోవచ్చు కదా అన డౌట్ వస్తుంది కదా.. కానీ అది లైట్ ... మంటతో వచ్చే లైట్. అంటే మంట ఎప్పుడూ ఆరిపోకుండా ఉండేలా చూసుకోవడమే లైట్ ఆరిపోకుండా చూసుకోవడం అన్నమాట. ఎవరికైనా ఆసక్తి ఉంటే.. పోర్ట్ ఆఫ్ అలెగ్జ్రాండియాను సంప్రదించవచ్చు.