Nissan Merger : హోండాతో చర్చలు విఫలం - కొత్త ఆటోమేకర్ పార్ట్ నర్స్ కోసం అన్వేషణ - జాబితాలో ఫాక్స్‌కాన్ పేరు
Nissan Merger : ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారేందుకు సహాయపడటానికి మరొక భాగస్వామిని కనుగొనడానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది. హోండాతో విలీన చర్చల నుండి బయటకు తీయడానికి సిద్ధమవుతోంది.

Nissan Merger : జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్, నిస్సాన్ మోటార్ మధ్య విలీనంకు సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీల మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు నిస్సాన్ కొత్త పార్ట్ నర్స్ కోసం వెతుకుతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ జపాన్ ఆటోమేకర్ విలీనం కోసం కొన్ని పేర్లను పరిశీలిస్తోందని, అందులో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కూడా ఉందని రాయిటర్స్ తెలిపింది.
రెండు సంస్థల మధ్య చర్చలు విఫలం
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమేకర్‌ను సృష్టించే ఒప్పందంలో ఈ వారం ప్రారంభంలో హోండాతో చర్చల నుండి నిస్సాన్ వెనక్కి తగ్గింది. అంతకుముందు విలీనం నిమిత్తం నిస్సాన్ సీఈఓ మకోటో ఉచిడా, హోండా టాప్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మిబేతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే హోండాతో అనుబంధ సంస్థగా పనిచేసేందుకు నిస్సాన్ నిరాకరించింది. చర్చలను ముగించాలని కోరుకుందని పలు నివేదికలు తెలిపాయి. ఈ విషయంపై హోండా గానీ, నిస్సాన్ ప్రతినిధులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కానీ డిసెంబర్‌లో, ఈ రెండు కంపెనీలు హోల్డింగ్ కంపెనీ కింద ఏకీకరణ గురించి చర్చించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఆ తర్వాత ఒప్పందంలో తలెత్తిన కొన్ని తేడాల వల్ల చర్చలు క్లిష్టతరమయ్యాయి. అవే చివరకు చర్చల విఫలమయ్యేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమలో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనడానికి జపాన్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హోండా మూడో అతిపెద్ద సంస్థ అయిన నిస్సాన్ విలీనం కోసం చర్చలు మొదలుపెట్టినట్లు గతేడాది ప్రకటించాయి. కానీ రెండు కంపెనీల మధ్య పెరుగుతోన్న విభేదాల వల్ల చర్చలు కష్టంగా మారాయని కొన్ని రోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి. నిస్సాన్ కంటే దాదాపు 3 రెట్టు ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన హోండా.. దాని పునరుద్దరణ ప్రణాళికలో భాగంగా నిస్సాన్ ఆందోళన చెందుతోంది, ఈ విలీనం రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని కూడా కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అనుకున్నట్టుగానే ఇరు సంస్థల మధ్య చర్చలు విఫలమై విలీనానికి అడ్డుకట్ట పడింది.
ఇతర ఆప్షన్స్ ను పరిశీలిస్తోన్న నిస్సాన్
హోండాతో చర్చల విఫలం అనంతరం, ఇప్పుడు నిస్సాన్ మరిన్ని ఆప్షన్స్ ను పరిశీలిస్తోంది. వాటిలోటెక్నాలజీ కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. ఎందుకంటే ఆటో పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త చైనీస్ తయారీదారులు, సాఫ్ట్‌వేర్ ఆధారిత కార్లు తీసుకువచ్చిన సాంకేతిక విప్లవాన్ని నిర్వహించడానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే విలీనం కోసం నిస్సాన్, ఫాక్స్‌కాన్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. తైవాన్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ కంపెనీ ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేస్తుంది. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ వాహనాల కాంట్రాక్ట్ తయారీ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీదారు అయిన ఈ ఎలక్ట్రిక్ వాహనాల వర్టికల్‌ను నిస్సాన్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జున్ సెకి నిర్వహిస్తున్నారని ఓ నివేదిక తెలిపింది.
Also Read : Smartphone Sales: స్మార్ట్‌ఫోన్‌లు, ఏసీలకు హై డిమాండ్ - వీటికి, ఆర్‌బీఐ నిర్ణయాలకు సంబంధమేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

