By: ABP Desam | Updated at : 28 Apr 2023 12:05 PM (IST)
టాప్-6 మ్యూచువల్ ఫండ్స్
Mutual Fund Schemes: స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి టెన్షన్ పడడం ఎందుకు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి నిశ్చితంగా నిద్రపోదాం అనుకుంటున్నారా? మీ కోసం టాప్-6 మ్యూచువల్ ఫండ్స్‌ను (best mutual funds) పరిచయం చేస్తున్నాం. వాస్తవానికి ఇవి పాత పథకాలే. అయితే... గత ఒక సంవత్సరం కాలంలో 20% పైగా గణనీయమైన రాబడిని పెట్టుబడిదార్లకు అందించాయి. అంతేకాదు, ఇవన్నీ డైరెక్ట్ ప్లాన్స్. అంటే, వీటి కోసం పెట్టుబడిదార్లు చెల్లించాల్సిన వ్యయ నిష్పత్తి (expense ratio) చాలా తక్కువ. మ్యూచువల్ ఫండ్‌లో మీ పెట్టుబడులను నిర్వహించినందుకు ఫండ్ మేనేజర్లు ఏడాదికి కొంత రుసుము వసూలు చేస్తారు, దీనిని వ్యయ నిష్పత్తిగా పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్స్‌లో వ్యయ నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ప్లాన్స్‌ను బట్టి కొద్ది మొత్తంలో మారుతుంటుంది. ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో లాభదాయకత అంత మెరుగ్గా ఉంటుంది.
ఈ రెండు కీలక అంశాల (అధిక రాబడి & తక్కువ ఖర్చులు) ఆధారంగా టాప్-6 మ్యూచువల్ ఫండ్స్‌ను 'ది ఎకనమిక్ టైమ్స్' షార్ట్‌లిస్ట్ చేసింది.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మీడియం టర్మ్ డైరెక్ట్ -గ్రోత్ (Aditya Birla Sun Life Medium Term Direct - Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 23.31% | వ్యయ నిష్పత్తి: 0.87% |ఫండ్ పరిమాణం: రూ. 1,764.41 కోట్లు
ICICI ప్రుడెన్షియల్ భారత్ 22 FoF డైరెక్ట్ - గ్రోత్ (ICICI Prudential BHARAT 22 FOF Direct - Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 22.64% | వ్యయ నిష్పత్తి: 0.08% | ఫండ్ పరిమాణం: రూ. 101.33 కోట్లు
ఇన్వెస్కో ఇండియా - ఇన్వెస్కో పాన్ యూరోపియన్ ఈక్విటీ FoF డైరెక్ట్ - గ్రోత్ (Invesco India - Invesco Pan European Equity FoF Direct-Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 21.60% | వ్యయ నిష్పత్తి: 0.51% | ఫండ్ పరిమాణం: రూ. 35.15 కోట్లు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్ - గ్రోత్ (ICICI Prudential Infrastructure Direct - Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 21.60% | వ్యయ నిష్పత్తి: 1.63% | ఫండ్ పరిమాణం: రూ. 2,360.98 కోట్లు
కోటక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్ ఫండ్ డైరెక్ట్ - గ్రోత్ (Kotak Infrastructure and Economic Reform Fund Direct - Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 20.37% | వ్యయ నిష్పత్తి: 1.00% | ఫండ్ పరిమాణం: రూ. 753.69 కోట్లు
ICICI ప్రుడెన్షియల్ ఎఫ్‌ఎంసీజీ డైరెక్ట్ - గ్రోత్ (ICICI Prudential FMCG Direct-Growth)
గత ఒక సంవత్సరంలో రాబడి: 20.36% | వ్యయ నిష్పత్తి: 1.45% | ఫండ్ పరిమాణం: రూ. 1,186.06 కోట్లు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Khel Ratna Award Winners: మను బాకర్, గుకేష్, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Game Changer: ‘గేమ్ చేంజర్’పై ఎఫెక్ట్ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!