అన్వేషించండి

Mutual Funds Nomination: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హై అలర్ట్‌, కీలక గడువు ముంచుకొస్తోంది

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో స్తంభించిపోతుందని తన నోటిఫికేషన్‌లో సెబీ తెలిపింది.

Mutual Funds Nomination: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లుకు 2023 మార్చి 31 తేదీ చాలా కీలకమైనది. ఈ గడువుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మీ అకౌంట్‌లో ఇంకా నామినేషన్ పని పూర్తి చేయకపోతే, ఈ రోజే ఆ పని పూర్తి చేయండి. ఇందుకు గడవు మార్చి 31వ తేదీ. ఈ లోగా పని పూర్తి కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), ఈ విషయంపై పెట్టుబడిదార్లకు ఇప్పటికే చాలాసార్లు సూచనలు జారీ చేసింది. అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను (AMCలు) కూడా అలెర్ట్‌ చేసింది. మార్చి 31 లోపు తమ పెట్టుబడిదార్లందరితో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయించే బాధ్యత AMCలదేనని నిర్దేశించింది. ఈ నోటిఫికేషన్‌ను మార్కెట్ రెగ్యులేటర్ జూన్ 2022లోనే జారీ చేసింది.

నామినేషన్ పూర్తి చేయని పక్షంలో నష్టం తప్పదు
మ్యూచువల్ ఫండ్‌ పెట్టుబడిదార్లంతా 2023 మార్చి 31 లోగా తమ అకౌంట్లలో నామినే పేరును యాడ్‌ చేయకపోతే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో స్తంభించిపోతుందని (mutual fund investor's portfolio freezes) తన నోటిఫికేషన్‌లో సెబీ తెలిపింది. ఇదే జరిగితే మీ ఖాతా నుంచి మీరు ఏ విధమైన లావాదేవీలు చేయలేరు, కోరికోరి నష్టాలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. నామినేషన్‌ వివరాలను సమర్పించిన తర్వాత మాత్రమే మళ్లీ ఆ అకౌంట్‌ యాక్టివేట్ అవుతుంది. ఈ తలనొప్పంతా ఎందుకనుకుంటే, గడువు లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం.

మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ ఎందుకు తప్పనిసరి?
వాస్తవానికి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల మంచి కోసమే సెబీ ఈ రూల్‌ తీసుకొచ్చింది. ఏ వ్యక్తి అయినా తన కుటుంబం కోసమే పెట్టుబడులు పెడతాడు. ఒకవేళ, మ్యూచువల్‌ ఫండ్‌ పథకం మెచ్యూరిటీకి ముందే దురదృష్టవశాత్తు ఆ పెట్టుబడిదారు మరణిస్తే, నామినేషన్‌ లేని పక్షంలో అతని డబ్బును కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం కష్టం అవుతుంది. అదే, నామినేషన్‌ ప్రక్రియ పూర్తయి ఉంటే, ఎలాంటి సమస్య ఉండదు, పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడిదార్ల ప్రయోజనం కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్‌ను SEBI తప్పనిసరి చేసింది.

ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు
మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం... మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ నామినేషన్ పనిని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నామినీ పేరును మీ ఖాతాకు జత చేయడానికి, మీరు మీ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అకౌంట్‌లో లాగిన్‌ అయిన తర్వాత, అకౌంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో నామినీ డిటెయిల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని, మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు. లేదా, అధికారిక హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కూడా హెల్ప్‌లైన్‌ నంబర్‌ నుంచి సాయం కోరవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ పనిని పూర్తి చేయడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget