Multibagger: 2000% పైగా పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ - 100% డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే స్టీల్ వైర్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్ అనగానే, సాధారణంగా రెండు లేదా మూడు రెట్ల లాభాలు ఇచ్చిన స్టాక్ అని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అయితే, ఒక కంపెనీ స్టాక్ మాత్రం మామూలుగా పెరగలేదు. పెట్టుబడిదార్ల సంపదను రెండు లేదా మూడు రెట్లు కాదు... ఏకంగా 2000 శాతానికి పైగా పెంచింది. అంతేకాదు, ఇప్పుడు ఈ కంపెనీ తన పెట్టుబడిదార్లకు 100% బంపర్ డివిడెండ్‌ను ప్రకటించింది.
స్మాల్ క్యాప్ కంపెనీ రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్ కథ ఇది. ఈ కంపెనీ మార్కెట్ విలువ కేవలం రూ. 4,230 కోట్లు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే స్టీల్ వైర్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఆటోమోటివ్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్ పరిశ్రమల్లో ఉపయోగించే వైర్‌ల తయారీలో రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్‌కు నైపుణ్యం ఉంది. భారతదేశంలో అతి పెద్ద బీడ్ వైర్ తయారీ & సరఫరాదారు ఇది.
ఇప్పుడు ఇది షేర్ ధర
ఇవాళ (సోమవారం, 24 ఏప్రిల్ 2023) ఉదయం 10.45 గంటల సమయానికి రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్ షేరు ధర (Rajratan Global Wire Ltd Share Price) ప్రస్తుతం 4.05% నష్టంతో రూ. 799 వద్ద ట్రేడ్ అవుతోంది.
షేర్ ధర గత ఒక నెల రోజుల కాలంలో దాదాపు 3% పెరిగింది. గత 6 నెలల కాలంలో 12% పైగా నష్టపోయిన ఈ కౌంటర్, గత ఒక ఏడాది కాలంలో చూస్తే దాదాపు 22% లాభపడింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 10% పైగా క్షీణించింది.
2200 శాతం పైగా లాభం
గత 3 సంవత్సరాల్లో దీని రాబడిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్ షేర్ ధరలో 2200 శాతానికి పైగా భారీ ర్యాలీ జరిగింది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం, దాని ఒక షేరు ధర రూ. 40 వద్ద ఉంటే.. ఇప్పుడు రూ. 800 వద్ద ఉంది.
అయితే, ప్రస్తుతం ఈ స్టాక్ దాని గరిష్ట స్థాయి నుంచి చాలా దిగువన ట్రేడ్ అవుతోంది. 8 సెప్టెంబర్ 2022న 52 వారాల గరిష్టం రూ. 1409 స్థాయికి చేరుకుంది. 17 జూన్ 2022న, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 539.40 వద్ద ఉంది.
ప్రస్తుతం ఈ స్టాక్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. తన ఇన్వెస్టర్లకు 100 శాతం డివిడెండ్ ఇవ్వనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. షేర్ ముఖ విలువ రూ. 2 ప్రకారం, ఒక్కో ఈక్విటీ షేర్ మీద 2 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత మార్కట్ ధర రూ. 800 ప్రకారం, డివిడెండ్ ఈల్డ్ 0.24%.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.