అన్వేషించండి

MRF: వారెవ్వా, 'లక్ష'ణమైన రికార్డ్‌ - రిలయన్స్‌, టీసీఎస్‌కూ ఇది చేతకాలేదు

ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న MRF స్టాక్‌ ప్రైస్‌కు, సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న హనీవెల్ ఆటోమేషన్‌ స్టాక్‌ ప్రైస్‌కు మధ్య దాదాపు 60% తేడా ఉంది.

MRF Share Price: టైర్ తయారీ కంపెనీ MRF, ఇవాళ (మంగళవారం, 13 జూన్‌ 2023) దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డ్‌ సృష్టించింది. రూ. 1,00,000 మార్క్‌ దాటిన మొట్టమొదటి స్టాక్‌గా ఇది నిలిచింది. ఇండియన్‌ బ్లూ చిప్‌ స్టాక్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండే రిలయన్స్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజాలకు కూడా ఈ ఫీట్‌ సాధ్యం కాలేదు.

ఇవాళ, BSEలో, MRF షేర్లు 1.37% ర్యాలీ చేసి రూ. 100,300 వద్దకు చేరాయి, కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని క్రియేట్‌ చేశాయి.

అంతకుముందు మే నెలలో, స్పాట్ మార్కెట్‌లో రూ. 1,00,000 మార్కును చేరుకోవడానికి MRF కేవలం రూ. 66.50 దూరంలో ఆగిపోయింది. అయితే, మే 8న, ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఈ సైకలాజికల్‌ మార్క్‌ను అధిగమించింది.

నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా
భారతదేశంలో, హైయస్ట్‌ ప్రైస్‌ ట్యాగ్‌ ఉన్న స్టాక్స్‌ జాబితాలో MRF అగ్రస్థానంలో ఉంది. విచిత్రం ఏమిటంటే, ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న MRF స్టాక్‌ ప్రైస్‌కు, సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న హనీవెల్ ఆటోమేషన్‌ స్టాక్‌ ప్రైస్‌కు మధ్య దాదాపు 60% తేడా ఉంది.

లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న హనీవెల్ ఆటోమేషన్ (Honeywell Automation) షేర్‌ ధర ఇవాళ రూ. 41,152 దరిదాపుల్లో ఉంది. జాబితాలో.. పేజ్ ఇండస్ట్రీస్ (రూ. 38,340), శ్రీ సిమెంట్ ‍‌(రూ. 25,920), 3ఎం ఇండియా ‍‌(రూ. 26,572), నెస్లే (రూ. 22,650), అబోట్ ఇండియా ‍‌(రూ. 22,154), బాష్ (రూ. 19,236) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

MRFకు హైయస్ట్‌ ప్రైస్‌ ట్యాగ్‌ ఉన్నా, అత్యంత ఖరీదైన స్టాక్‌గా పరిగణనించరు. ఎందుకంటే, ప్రైస్ టు ఎర్నింగ్స్ (PE) లేదా ప్రైస్ టు బుక్ వాల్యూ (PB) వంటి కొలమానాల ఆధారంగా ఒక సెక్యూరిటీ విలువను పెట్టుబడిదార్లు నిర్ణయిస్తారు. ఏ స్క్రిప్‌ PE లేదా PB ఎక్కువగా ఉంటే, అదే మోస్ట్‌ ఎక్స్‌పెన్సివ్‌ స్టాక్‌.

గత 12 నెలల ప్రాతిపదికన, MRF షేర్లు ఆదాయాలకు 55.2 రెట్ల PE వద్ద ట్రేడవుతున్నాయి. దీనిని చాలా ఎక్కువ PE వాల్యుయేషన్‌గానే చూడాలి. అయితే, ఇంతకంటే ఎక్కువ PEతో ట్రేడవుతున్న స్టాక్స్‌ కూడా దలాల్‌ స్ట్రీట్‌లో ఉన్నాయి.

సాధారణంగా, షేర్‌ ప్రైస్‌ పెద్ద మొత్తానికి చేరినప్పుడు స్టాక్ స్ల్పిట్‌ ద్వారా ప్రైజ్‌ ట్యాగ్‌ను ఆ కంపెనీ కట్‌ చేస్తుంది. కానీ MRF ఎప్పుడూ అలా చేయలేదు. చెన్నైకి చెందిన ఈ కంపెనీ మొత్తం 42,41,143 షేర్లను కలిగి ఉంది, వీటిలో 30,60,312 షేర్లు పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతుల్లో ఉన్నాయి, ఇది మొత్తం ఈక్విటీలో 72.16%కి సమానం. ప్రమోటర్ల దగ్గర 27.84% సమానమైన 11,80,831 షేర్లు ఉన్నాయి.

దాదాపు రూ. 42,500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న MRF స్టాక్ గత 3 నెలల్లో 20% పైగా ర్యాలీ చేసింది.

ఫండమెంటల్ ఔట్‌లుక్‌
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, MRFపై కవరేజ్ ఉన్న 7 మంది ఎనలిస్ట్‌ల్లో ఐదుగురు సెల్‌ రేటింగ్స్‌ ఇచ్చారు.

మోతీలాల్ ఓస్వాల్, కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌ గతంలో ఈ స్టాక్‌కు వరుసగా రూ. 75,400 & రూ. 66,000 టార్గెట్‌లు ఇచ్చాయి.

MRFపై 'హోల్డ్' సిఫార్సు చేసిన ఆనంద్ రాఠీ, రూ. 96,000 టార్గెట్‌ ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి ఈ స్టాక్‌ ఎదగడం కష్టమేనని వెల్లడించింది.

మరో ఆసక్తికర కథనం: టాప్‌ రేంజ్‌లో పెరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు, ఎంత హైక్‌ ఇచ్చారో తెలుసా? 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget