అన్వేషించండి

₹2000: దాస్‌ నోట ₹2 వేల మాట, సెప్టెంబర్‌ 30 తర్వాత పింక్‌ నోట్లు చెల్లవా?

మూడింట రెండు వంతులకు పైగా (2/3 వంతు) నోట్లు తిరిగి సిస్టమ్‌లోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

2000 Rupee Notes: 2 వేల రూపాయల నోట్ల విషయంలో అంతా ఆర్‌బీఐ ప్లాన్‌ ప్రకారమే జరుగుతోంది. బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి ఎప్పుడు, ఎంత మొత్తం తిరిగి వస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేసిందో, అది పక్కాగా జరుగుతోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనాలు ఇంచ్‌ కూడా తేడా లేకుండా వాస్తవాలుగా మారుతున్నాయి.

రీకాల్ ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల్లోనే రూ.2,000 కరెన్సీ నోట్లలో మూడింట రెండు వంతులకు పైగా (2/3 వంతు) నోట్లు తిరిగి సిస్టమ్‌లోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్‌బీఐ గత అంచనాకు ఇది అనుగుణంగా ఉంది.

15 రోజుల్లో సగం నోట్లు తిరుగుముఖం
ఈ నెల 8న, మానిటరీ పాలసీ రివ్యూ సమయంలో మాట్లాడిన దాస్, అప్పటి వరకు రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి వచ్చాయని చెప్పారు. 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో ఈ మొత్తం దాదాపు 50 శాతానికి సమానం. రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 85 శాతం డిపాజిట్లుగా, మిగిలినవి ఎక్సేంజ్‌ రూపంలో బ్యాంకులను విజిట్‌ చేశాయి.

2023 మార్చి చివరి నాటికి, భారతదేశంలో రూ.3.7 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2 వేల నోట్ల వాటా 10.8%. 

"ఇప్పుడు, విత్‌డ్రా చేసిన 2000 నోట్లలో మూడింట రెండు వంతులు లేదా రూ.2.41 లక్షల కోట్ల విలువైన నోట్లు గత వారం మధ్య నాటికి వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి" - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 

నెల రోజుల్లో 2/3 వంతు నోట్లు రిటర్న్‌
అంటే, నెల రోజుల్లో 2/3 వంతు నోట్లు జనం నుంచి రిటర్న్‌ అయ్యాయి. ఇందులోనూ, 85 శాతం డిపాజిట్లుగా, మిగిలినవి ఎక్సేంజ్‌ కోసం బ్యాంకులను పలకరించాయి.

“నోట్ రీకాల్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించడం లేదు” - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

2023 మే 19న, రూ.2,000 కరెన్సీ నోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్‌ల్లో మార్చుకోవడానికి 23 మే 2023 నుంచి అనుమతించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా, పింక్‌ నోట్లను బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేయడం లేదా మార్చుకోవచ్చు. 

ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి అవసరం ఉన్నా, లేకున్నా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో వినియోగం పెరిగింది. ఖరీదైన వస్తువులు, బంగారం, వజ్రాభరణాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో, ముఖ్యంగా ఖాళీ స్థలాల క్రయవిక్రయాలు గతంలో కంటే వేగంగా జరుగుతున్నాయి. 

వినియోగం పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌ దొరుకుతుందని, గతంలో అంచనా వేసిన 6.5 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని దాస్‌ అభిప్రాయపడ్డారు.

సెంట్రల్ బ్యాంక్, భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో GDPని 6.5 శాతంగా అంచనా వేస్తున్నాయి, Q1 ప్రింటింగ్ 8.1 శాతానికి చేరుతుందని, తరువాతి త్రైమాసికాల్లో తగ్గిపోతుందని భావిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 30 తర్వాత పింక్‌ నోట్లు చెల్లుతాయా, చెల్లవా?
సెప్టెంబరు 30 వరకు 2,000 డినామినేషన్ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతుంది. సెప్టెంబరు 30 గడువు తర్వాత ఆ నోట్లను రద్దు చేయాలమని తాను ప్రభుత్వాన్ని కోరతానో, లేదో తనకు ఖచ్చితంగా తెలియదని దాస్ చెప్పారు.

ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగు-ఐదు సంవత్సరాలు. ఆ గడువు ఇప్పుడు ముగింపులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్‌ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణ బంద్‌ చేశాయి.

మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేయాలా?, ప్రాసెస్‌ చాలా సింపుల్‌ 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: నేడు అమరావతికి ప్రధాని మోదీ, రాజధాని పనులకు శ్రీకారం, అనంతరం భారీ బహిరంగ సభ- పూర్తి షెడ్యూల్
నేడు అమరావతికి ప్రధాని మోదీ, రాజధాని పనులకు శ్రీకారం, అనంతరం భారీ బహిరంగ సభ- పూర్తి షెడ్యూల్
Operation Karre Guttalu: మావోయిస్టులకు పెట్టని కోట కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుసా ?
 మావోయిస్టులకు పెట్టని కోట కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుసా ?
Pahalgam Terror Attack Updates:
"ఎవర్నీ వదలం, వెతివెతికి చంపుతాము" పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
HIT 3: నాని 'హిట్ 3' మూవీ టీంకు షాక్ - ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
నాని 'హిట్ 3' మూవీ టీంకు షాక్ - ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vaibhav Suryavanshi Duck out vs MI IPL 2025 | ముంబై మీద డకౌట్ అయిన వైభవ్ సూర్యవంశీ | ABP DesamMumbai Indians Six wins in a row IPL 2025 | అప్రహతిహత జైత్రయాత్రతో మొదటి స్థానానికి ముంబై | ABP DesamRR vs MI Match Highlights IPL 2025 Explained in Telugu | రాజస్థాన్ పై 100 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ | ABP DesamRR vs MI Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 100 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: నేడు అమరావతికి ప్రధాని మోదీ, రాజధాని పనులకు శ్రీకారం, అనంతరం భారీ బహిరంగ సభ- పూర్తి షెడ్యూల్
నేడు అమరావతికి ప్రధాని మోదీ, రాజధాని పనులకు శ్రీకారం, అనంతరం భారీ బహిరంగ సభ- పూర్తి షెడ్యూల్
Operation Karre Guttalu: మావోయిస్టులకు పెట్టని కోట కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుసా ?
 మావోయిస్టులకు పెట్టని కోట కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుసా ?
Pahalgam Terror Attack Updates:
"ఎవర్నీ వదలం, వెతివెతికి చంపుతాము" పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
HIT 3: నాని 'హిట్ 3' మూవీ టీంకు షాక్ - ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
నాని 'హిట్ 3' మూవీ టీంకు షాక్ - ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Caste Census| కేంద్రం చేపట్టనున్న కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం చేపట్టనున్న కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu TV Movies Today: చిరు ‘చూడాలని వుంది’, వెంకీ ‘వాసు’ to ప్రభాస్ ‘బాహుబలి 2’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ వరకు - ఈ శుక్రవారం (మే 2) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘చూడాలని వుంది’, వెంకీ ‘వాసు’ to ప్రభాస్ ‘బాహుబలి 2’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ వరకు - ఈ శుక్రవారం (మే 2) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Indian Railway Ticket Rules: రైల్వే కొత్త రూల్స్ తెలుసా, వెయిటింగ్ టిక్కెట్ ప్యాసింజర్లు అలా చేస్తే భారీ జరిమానా
రైల్వే కొత్త రూల్స్ తెలుసా, వెయిటింగ్ టిక్కెట్ ప్యాసింజర్లు అలా చేస్తే భారీ జరిమానా
Simhachalam Incident: సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు- న్యాయవిచారణకు వైసీపీ డిమాండ్ -కేంద్రానికి ఫిర్యాదు
సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు- న్యాయవిచారణకు వైసీపీ డిమాండ్ -కేంద్రానికి ఫిర్యాదు
Embed widget