By: ABP Desam | Updated at : 26 Jun 2023 10:01 AM (IST)
పీపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయాలా?, ప్రాసెస్ చాలా సింపుల్
PPF Account Closure: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (Public Provident Fund) జమ చేసే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. PPF అకౌంట్‌ను పోస్టాఫీసు/ఏదైనా బ్యాంకు బ్రాంచ్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనూ అకౌంట్‌ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 500 రూపాయలు, గరిష్టంగా ఒక లక్ష 50 వేల రూపాయలను PPF ఖాతాలో జమ చేయవచ్చు.
ఇది EEE కేటగిరీ స్కీమ్. అంటే పూర్తిగా పన్ను రహితం. ప్రతి సంవత్సరం మీరు డిపాజిట్ చేసిన మొత్తం, ఆ మొత్తం మీద ప్రతి సంవత్సరం అందుకునే వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో విత్ డ్రా చేసే సొమ్ము... ఈ మొత్తాలన్నింటి మీగ ఇన్‌కం టాక్స్ కట్టాల్సిన పని లేదు.
15 సంవత్సరాలు + 5 సంవత్సరాలు
దీర్ఘకాల పెట్టుబడికి ఇదొక మంచి ఆప్షన్. PPF ఖాతాలో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. 15 సంవత్సరాలు ముగిసిన తర్వాత, మీకు కావాలంటే మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.
ఖాతా ప్రారంభించిన 15 ఏళ్ల తర్వాత మీ మెచ్యూరిటీ అమౌంట్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, మెచ్యూరిటీకి ముందే PPF ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే కొన్ని రూల్స్ పాటించాలి. ముందస్తు ఉపసంహరణకు కొంత జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
ఆరేళ్ల లాక్-ఇన్ పిరియడ్
PPF ఖాతా మొదటి 6 సంవత్సరాలు పూర్తిగా లాకిన్‌లో ఉంటుంది. ఆ కాలంలో ఒక్క రూపాయి కూడా వెనక్కు తీసుకోవడం కుదరదు. ఆ తర్వాత, PPF ఖాతా నుంచి ఏటా 50 శాతం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
ఉదాహరణకు... ఒక వ్యక్తి 2020-21 ఆర్థిక సంవత్సరంలో PPF ఖాతాను ఓపెన్ చేస్తే, అతను 2026-27 తర్వాత మాత్రమే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ముందస్తు విత్ డ్రా మీద కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
PPF ఖాతా మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే, ఖాతాదారు నామినీకి ఈ 6 సంవత్సరాల ఈ షరతు వర్తించదు. నామినీ ఎప్పుడైనా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
ఫారం-C ద్వారా డబ్బు విత్ డ్రా
కొంతమంది తమ PPF ఖాతాలను 15 ఏళ్ల లోపే మూసివేస్తుంటారు. ఖాతాదారు లేదా వారిపై ఆధారపడిన వారికి ప్రాణాంతక అనారోగ్యం లేదా ఉన్నత విద్య వంటి ప్రత్యేక అవసరాల కోసం డబ్బు అవసరమైతే PPF ఖాతాను ముందుగానే మూసేసే అవకాశం ఉంది. మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేస్తే, అకౌంట్ ఓపెనింగ్ తేదీ నుంచి క్లోజ్ చేసిన తేదీ వరకు 1 శాతం వడ్డీని తీసేస్తారు.
PPF ఖాతా నుంచి ముందుగానే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ఫారం-C సమర్పించాలి. ఈ ఫామ్ పోస్టాఫీసు, బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫామ్‌లో, మీ ఖాతా నంబర్, విత్ డ్రా చేయాలనుకుంటున్న మొత్తం, ఇతర వివరాలను రాయాలి. ఆ ఫామ్‌ను పాస్‌బుక్‌తో పాటు పోస్టాఫీస్/బ్యాంక్ అధికారికి సబ్మిట్ చేయాలి. మీరు కోరిన మొత్తాన్ని నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. లేదా, ఆ డబ్బును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' TCS, Shree Cement
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam