By: Arun Kumar Veera | Updated at : 20 Jan 2025 01:41 PM (IST)
పెట్టుబడిదారులంతా ధనవంతులు ( Image Source : Other )
Trump Meme Coin Jumps 300 Percent: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల తన కొత్త మీమ్ కాయిన్ "$TRUMP"ను విడుదల చేశారు, ఇది క్రిప్టో మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. లాంచ్ అయిన వెంటనే ఈ టోకెన్ సునామీలా విజృంభించి ఏకంగా 300 శాతం పెరిగింది. దీని పెట్టుబడిదారులను డాలర్ల వరద ముంచెత్తింది.
ప్రయోగించిన వెంటనే రాకెట్ వేగం
$TRUMP మీమ్ కాయిన్ 19 జనవరి 2025న సోలానా నెట్‌వర్క్‌లో ప్రారంభమైంది. దీని ఓపెనింగ్ ప్రైస్ ధర 0.18 డాలర్లు కాగా, కొన్ని గంటల్లో 7.1 డాలర్లకు ఎగబాకింది. ఈ కాలంలో, ఈ టోకెన్ మార్కెట్ క్యాప్ 4.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ టోకెన్ లాంచ్ అయిన మొదటి రెండు గంటల్లో 4,200 శాతం పెరిగిందని కూడా కొన్ని న్యూస్ ఛానెల్స్ రిపోర్ట్ చేశాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రచారం
డొనాల్డ్ ట్రంప్, తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో $TRUMP మీమ్ కాయిన్ గురించి ప్రచారం చేశారు. కాయిన్‌ను చూపుతూ, "ఇది విజయాన్ని జరుపుకునే సమయం" అని పేర్కొన్నారు. దీంతో, $TRUMP టోకెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కాలిఫోర్నియా దావానలంలా వ్యాపించింది, విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
పెట్టుబడిదారులంతా ధనవంతులు
$TRUMP టోకెన్‌ను లాంచ్ చేసిన తర్వాత, చాలా మంది పెట్టుబడిదారులు & క్రిప్టో మద్దతుదారులు ఈ నాణెం కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. ట్రేడింగ్ వాల్యూమ్ దాదాపు 1 బిలియన్ డాలర్లకు చేరుకుంది, మార్కెట్లో ఉన్న బలమైన ఆసక్తిని స్పష్టంగా చూపించింది. అయితే, ఇది శాశ్వత పెట్టుబడిగా నిలుస్తుందా లేక తాత్కాలిక బూమ్‌గా మిగిలిపోతుందా అనే సందేహాలు కూడా కొందరు పెట్టుబడిదారుల నుంచి వ్యక్తమయ్యాయి.
ట్రంప్ క్రిప్టో విధానాలు ఏంటి?
డొనాల్డ్ ట్రంప్, తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో క్రిప్టో కరెన్సీల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు. "క్రిప్టో ప్రెసిడెంట్" అవుతానని కూడా చెప్పారు. అమెరికా అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్న తర్వాత, వైట్ హౌస్ నుంచి క్రిప్టో పరిశ్రమను ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. సమాచారం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టో అడ్వైజరీ కౌన్సిల్‌ను రూపొందించడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయవచ్చు.
జాగ్రత్త సుమా..
$TRUMP మీమ్ కాయిన్ ప్రారంభ విజయాన్ని సాధించి ఉండవచ్చు, కానీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా అస్థిరంగా ఉంటుంది. మీమ్ కాయిన్స్ ఎక్కువగా జోక్‌గా మిగిలిపోతాయి, పెట్టుబడిదార్లను జోకర్లను చేస్తాయి. ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడకపోతే వాటి విలువ పడిపోతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఇండియన్ టెక్కీల భవిష్యత్‌పై క్వచ్ఛన్ మార్క్! - H1B వీసాలపై టెన్షన్ టెన్షన్
Silver Price: వెండి మెరుపు ముందు వెలవెలబోయిన బంగారం, స్టాక్ మార్కెట్! ఏడాదిలో 130% కంటే ఎక్కువ పెరుగుదల!
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ