Stock Market update: వరుస నష్టాలకు చెక్.. మళ్లీ 60వేల వైపు సెన్సెక్స్
సెంటిమెంటు బాగుండటంతో సోమవారం సూచీలు అదరగొట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 60వేల మైలురాయి వైపు పరుగులు తీసింది. నిఫ్టీ సైతం అదే బాటలో నడిచింది.
నాలుగు రోజులు వరుస నష్టాలకు విరామం దొరికింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం, సెంటిమెంటు బాగుండటంతో సోమవారం సూచీలు అదరగొట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 60వేల మైలురాయి వైపు పరుగులు తీసింది. నిఫ్టీ సైతం అదే బాటలో నడిచింది.
Also Read: ఈ-శ్రమ్‌కు భారీ స్పందన.. 2.5 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 300 పాయింట్ల లాభంతో ఆరంభమైంది. 59,541 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మదుపర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో సూచీ స్థిరంగా కదలాడింది. చివరికి 533 పాయింట్ల లాభంతో 59,299 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం అదే దారిలో పరుగులు తీసింది. 17,740 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి 159 పాయింట్ల లాభంతో 17,691 వద్ద ముగిసింది. రానున్న రోజుల్లో నిఫ్టీ 18,000 మార్క్‌ను తాకనుంది. ఎన్‌ఎస్‌ఈలో దాదాపుగా 2227 షేర్లు లాభపడగా 961 నష్టాల్లో ముగిశాయి. 172 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు.
Also Read: మొబైల్ యాక్సెసరీలపై సూపర్ ఆఫర్లు.. రూ.49 నుంచే ప్రారంభం!
దివీస్ ల్యాబ్, హిందాల్కో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ షేర్లు లాభపడగా సిప్లా, గ్రాసిమ్, యూపీఎల్, ఐవోసీ, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల బాట పట్టాయి.
Also Read: వేగంగా అడుగులు.. నవంబర్లోనే ఎల్‌ఐసీ ఐపీవో ముసాయిదా దాఖలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
H. E. Mr. Hugo Xavier Gobbi, Ambassador of #Argentina to India along with Shri @ashishchauhan, MD&CEO, BSE and others pose with the #BSEBull on 4th Oct, 2021 pic.twitter.com/FVbvjCAHmg
— BSE India (@BSEIndia) October 4, 2021
Sensex opens at 59143 with a gain of 377 points. pic.twitter.com/nzaGd4V7A5
— BSE India (@BSEIndia) October 4, 2021
BSE commodity price update 1st October, 2021#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/YjIv0MrzTn
— BSE India (@BSEIndia) October 4, 2021