e-SHRAM Portal Registration: ఈ-శ్రమ్‌కు భారీ స్పందన.. 2.5 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి
కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన ఈ-శ్రమ్ (e-SHRAM) పోర్టల్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి' అని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన ఈ-శ్రమ్ (e-SHRAM) పోర్టల్‌కు భారీ స్పందన లభిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన రెండున్నర కోట్ల మంది కార్మికులు ఇప్పటికే పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2021, ఆగస్టు 26 ఈ ఆన్‌లైన్ వేదికను ఆరంభించిన సంగతి తెలిసిందే. 'ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి' అని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలోని అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, నిర్మాణ కూలీలు, ఇతర కార్మికుల డేటాబేస్‌ను తయారు చేసేందుకు కేంద్రం ఈ శ్రమ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం అసంఘటిత రంగంలో 38 కోట్లకు పైగా కార్మికులు ఉన్నారు. ఉపాధి అవకాశాలు మాత్రం అంతకన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం.
Also Read: వేగంగా అడుగులు.. నవంబర్లోనే ఎల్‌ఐసీ ఐపీవో ముసాయిదా దాఖలు!
Distributed e-Shram cards to unorganised workers. Presented approval letters under ESIC Covid Relief Scheme to the dependents of the people who lost their lives due to the pandemic. Also, distributed letters under Atal Beemit Vyakti Kalyan Yojana to workers. pic.twitter.com/Ybm8dzv83P
— Bhupender Yadav (@byadavbjp) October 3, 2021
పోర్టల్ ఆరంభించిన నాలుగో వారంలోనూ కార్మికుల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదయ్యాయని కేంద్ర కార్మికమంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఈ సంఖ్య 1.71 కోట్లను దాటేసిందని పేర్కొన్నారు. కార్మికుల డేటాబేస్ రూపొందితే భవిష్యత్తులో వారికి ఉపాధి కల్పన, మెరుగైన జీతభ్యతాలు, వారికి అండదండలు లభిస్తాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఆయన పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు, చండీగఢ్, జమ్ము కశ్మీర్, లద్దాక్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కార్మిక మంత్రులు, కార్మికశాఖ కార్యదర్శులను కలిసి మాట్లాడారు.
Also Read: మొబైల్ యాక్సెసరీలపై సూపర్ ఆఫర్లు.. రూ.49 నుంచే ప్రారంభం!
ఈ-శ్రమ్‌లో నమోదైన వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. అర్హులైన వారికి ఈఎస్‌ఐసీ కొవిడ్ రిలీఫ్ పథకాన్ని వర్తింపజేయనుంది.
Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్