By: ABP Desam | Updated at : 13 Jul 2023 12:35 PM (IST)
నిఫ్టీ ఎలైట్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఎల్‌టీఐమైండ్‌ట్రీ
LTIMindtree Shares: నిన్న (బుధవారం, 12 జులై 2023) సాయంత్రంతో HDFC షేర్ల ట్రేడింగ్ నిలిచిపోవడంతో, దేశంలో ఆరో అతి పెద్ద ఐటీ సర్వీసెస్ ప్లేయర్ ఎల్‌టీఐమైండ్‌ట్రీకి 'నిఫ్టీ ఎలైట్ క్లబ్'లోకి ఎంట్రీ దొరికింది. HDFC ప్లేస్‌లో, నిఫ్టీ50లోకి ఎల్‌టీఐమైండ్‌ట్రీ అడుగు పెట్టింది.
HDFC బ్యాంక్‌తో మెర్జర్ కారణంగా వైదొలిగిన HDFC షేర్ల ప్లేస్‌ను.., L&T ఇన్ఫోటెక్ (LTI) - మైండ్‌ట్రీ మెర్జర్‌తో ఏర్పడిన LTIMindtree షేర్లు భర్తీ చేయడం విశేషం. గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త పేరుతో (LTIMindtree) మెర్జ్‌డ్ ఎంటీటీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభించింది. జూనియర్ నిఫ్టీగా పిలిచే Nifty Next50లో నిన్నటి వరకు ఇది ఒక భాగం. ఇవాళ ప్రమోషన్‌తో సీనియర్ నిఫ్టీలోకి (నిఫ్టీ50) ప్రమోషన్ పొందింది.
తొలి రోజు పాజిటివ్ పెర్ఫార్మెన్స్
నిఫ్టీ ఇండెక్స్‌లో LTIMindtree మొదటి రోజు పాజిటివ్‌గా ప్రారంభం అయింది. NSEలో ఈ స్టాక్ 2% పైగా ర్యాలీ చేసి రూ. 4,943.90 వద్ద ఇంట్రా-డే హైని టచ్ చేసింది.
నిఫ్టీ50లోకి LTIMindtree రావడం వల్ల దీనికి సుమారు 172 మిలియన్ డాలర్ల పాసివ్ ఫండ్స్ వచ్చి పడతాయి. అదే సమయంలో, నిఫ్టీ నెక్స్ట్50 నుంచి బయటకు వెళ్లిన కారణంగా 50 మిలియన్ డాలర్ల ఔట్‌ఫ్లో కూడా ఉంటుంది. నికరంగా 125-130 మిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లో ఉంటుంది.
LTIMindtree నిఫ్టీ50లో చేరిన తర్వాత, CRISIL, ఇండియా రేటింగ్స్ రెండూ వాటి రేటింగ్ అప్‌డేట్స్ రిలీజ్ చేశాయి. LTIMindtree లాంగ్‌టర్మ్ రేటింగ్‌ను AAA/స్టేబుల్‌గా అవి కంటిన్యూ చేశాయి. ఈ స్టాక్‌కు ఇది పాజిటివ్ ట్రిగ్గర్. ఈ రేటింగ్స్, LTIMindtree వ్యాపారంలో బలాన్ని, ఆరోగ్యకరమైన పనితీరును, స్థిరమైన వ్యాపార అభివృద్ధిని సూచిస్తున్నాయి.
ఇవాళ ఉదయం 11.45 గంటల సమయానికి, LTIMindtree షేర్లు 1.84% లాభంతో రూ. 4,905.05 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
LTIMindtree షేర్లు ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 14% ర్యాలీ చేశాయి, ఇదే సెక్టార్‌లోని పెద్ద కంపెనీలను ఓవర్‌టేక్ చేశాయి. గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది, గత 12 నెలల కాలంలో 1.42% మేర తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి ఈ స్టాక్ సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో షేర్ దాదాపు 1100 రూపాయలు లేదా 26% పైగా పెరిగింది.
ఈ కంపెనీ, తన జూన్ త్రైమాసిక ఫలితాలను (LTIMindtree Q1 FY24 Results) వచ్చే సోమవారం ప్రకటిస్తుంది.
స్టాక్ రికమెండేషన్స్
ఈ స్టాక్‌ను 34 మంది ఎనలిస్ట్‌లు కవర్ చేస్తున్నారు. అంటే, ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వాళ్లు ట్రాక్ చేస్తారు. కంపెనీ భవిష్యత్‌పై తమ అంచనాల ఆధారంగా ఈ స్టాక్‌కు రేటింగ్, టార్గెట్ ప్రైస్ ప్రకటిస్తారు. ఈ 34 మంది ఎనలిస్టుల్లో 16 మంది "బయ్" రేటింగ్ ఇచ్చారు. 9 మంది "హోల్డ్" చేయమంటున్నారు. మరో 9 మంది "సెల్" రికమెండ్ చేశారు.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ 60k టచ్ చేసిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today: తగ్గినట్లే తగ్గి షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Car Sales Report November: నవంబర్‌లో దూసుకుపోయిన కార్ల అమ్మకాలు - టాప్ 5 లిస్ట్ ఇదే!
MSSC vs SSY: ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన - ఏది బెటర్ ఆప్షన్?
Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్ కట్టాలో ముందు తెలుసుకోండి
Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>