అన్వేషించండి

LPG Price Down: గ్యాస్ సిలిండర్ యూజర్లకు భారీ ఊరట, ఏకంగా రూ.91 తగ్గింపు - వీరికి మాత్రమే వర్తింపు

దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1885 కు తగ్గింది. గురువారం నుంచి కోల్‌కతాలో రూ.1995, ముంబయిలో రూ.1,844, చెన్నయ్‌లో రూ.2,045 గా ఉంది.

వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించాయి. అయితే, ఈ తగ్గింపు ఊరట డొమెస్టిక్ సిలిండర్లపై మాత్రం వర్తించదు. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరపై మాత్రమే తగ్గింపు ఉండనుంది. గురువారం నుంచి  లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై రూ.91.50 ధర తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజా ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1885 కు తగ్గింది. గురువారం నుంచి కోల్‌కతాలో రూ.1995, ముంబయిలో రూ.1,844, చెన్నయ్‌లో రూ.2,045 ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర ఉండనుంది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,099.5కు చేరింది. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై రూ.91.5 తగ్గడంతో చిరు వ్యాపారులు, రెస్టారెంట్లకు కొంత ఊరట లభించనుంది. 

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అయింది. అయితే, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో వారు కాస్త నిరాశ చెందారు. ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్లు మునుపటి ధరకే లభించనున్నాయి. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1053 గా ఉంది.  గత నెలలో దీనిపై రూ.50 పెంచారు.

వాణిజ్య LPG సిలిండర్ ధర వరుసగా నాలుగో నెల తగ్గింది. జూన్ 1న రూ.135 తగ్గగా, జూలై 1న రూ.198 తగ్గింది. ఆగస్టు 1న దీని ధర రూ.36 తగ్గింది. అంతకుముందు ఏప్రిల్ 1న, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.249.50 పెరిగింది, దీని కారణంగా ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,253గా ఉంది. ఆ తర్వాత మే 1, 2022న కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.104 పెరిగింది.

ఏపీలో ప్రస్తుత డొమెస్టిక్ సిలిండర్ ధరలు

Anantapur - ₹ 1,119.50

Chittoor -  ₹ 1,089

Cuddapah -  ₹ 1,103

East Godavari - ₹ 1,081.50 

Guntur - ₹ 1,094.50

Krishna - ₹ 1,077

Kurnool - ₹ 1,108

Nellore - ₹ 1,090

Prakasam - ₹ 1,098

Srikakulam - ₹ 1,084.50

Visakhapatnam - ₹ 1,062

Vizianagaram - ₹ 1,078.50

West Godavari - ₹ 1,092 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు

Adilabad ₹ 1,130

Bhadradri Kothagudem ₹ 1,092

Hyderabad ₹ 1,105

Jagitial ₹ 1,125

Jangaon ₹ 1,116

Kamareddy ₹ 1,127

Karim Nagar ₹ 1,124

Khammam ₹ 1,092

Mancherial ₹ 1,125

Medak ₹ 1,123

Mahabubnagar ₹ 1,107

Nalgonda ₹ 1,126.50

Nizamabad ₹ 1,128.50

Sangareddy ₹ 1,105

Siddipet ₹ 1,122

Warangal ₹ 1,124

Yadadri Bhuvanagiri ₹ 1,107.50

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget