అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gas Cylinder Price: వంట గ్యాస్‌ యూజర్లకు షాక్‌ - పెరిగిన LPG సిలిండర్‌ ధర

LPG Cylinder Price Today: LPG సిలిండర్ ధరలో మార్పు ఈ రోజు (01 ఆగస్టు 2024) నుంచి అమల్లోకి వచ్చింది. మీ ప్రాంతంలో LPG సిలిండర్ తాజా ధరను ఇక్కడ చూడొచ్చు.

LPG Cylinder Price Increased From 01 August 2024: ఆగస్టు మొదటి తేదీన గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదార్లకు ధరల షాక్‌ తగిలింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను మార్చాయి. ఈ మార్పు వల్ల, ఈ రోజు నుంచి (ఆగస్టు 01, 2024) నుంచి కమర్షియల్ LPG సిలిండర్ల ధర పెరిగింది. 

ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ రోజు నుంచి దేశంలోని వివిధ నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధర సుమారు రూ. 6.50 నుంచి రూ. 9 వరకు పెరిగింది. ఈ పెంపు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్లకు మాత్రమే. గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు.

మెట్రో నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ కొత్త ధర
తాజా పెంపు తర్వాత, దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 6.50 పెరిగి రూ. 1652.50కి చేరుకుంది. కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ రేటు రూ. 1,764.50 కు అందుబాటులోకి వచ్చింది. ఈ నగరంలో రూ. 8.50 పెరిగింది. పెద్ద సిలిండర్ కోసం ముంబై ప్రజలు ఈ రోజు నుంచి రూ. 1,605 చెల్లించాలి. చెన్నైలో బ్లూ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ. 1,817 అవుతుంది.

వరుసగా 4 నెలలు ధర తగ్గింపు
ఆగస్టుకు ముందు, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర వరుసగా నాలుగు నెలల పాటు తగింది. గత నెలలో, జులై 01న, 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజి సిలిండర్ ధర సుమారు 30 రూపాయలు తగ్గింది. జూన్‌ 01న ఇదే సిలిండర్‌పై 19 రూపాయలు,  మే 01న 19 రూపాయలు, ఏప్రిల్‌ 01న 35 రూపాయల చొప్పున రేట్‌ కట్‌ ప్రకటించాయి. ఏప్రిల్‌కు ముందు, వరుసగా మూడు నెలల పాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. 

డొమెస్టిక్‌ LPG సిలిండర్ యూజర్లకు మరోమారు నిరాశ
ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల LPG సిలిండర్ల ధరల్లో ‍‌(Domestic LPG Cylinder Price Today) ప్రభుత్వ చమురు సంస్థలు ఎలాంటి మార్పు లేదు, సామాన్య ప్రజలకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో, ఈ సంవత్సరం మహిళా దినోత్సవం (08 మార్చి 2024) సందర్భంగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటును 100 రూపాయలు తగ్గించింది. సామాన్య పౌరులు ఉపయోగించే గ్యాస్‌ బండ రేటును తగ్గించడం అదే చివరిసారి. అప్పటి నుంచి, 5 నెలలుగా ఎర్ర సిలిండర్‌ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ రేట్లు
హైదరాబాద్‌లో, 14.2 కేజీల సిలిండర్ కోసం ‍‌(14 KGs Gas Cylinder Price In Hyderabad) రూ. 855 చెల్లించాలి. విజయవాడలో ఇదే గ్యాస్‌ బండ రేటు ‍‌(14 KGs Gas Cylinder Price In Vijayawada) రూ. 855 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో, చిన్నపాటి మార్పులతో ఇదే ధర అమలవుతోంది.

14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్ ధర దిల్లీలో రూ. 803, కోల్‌కతాలో రూ. 803, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 818.50 గా ఉంది.

మరో ఆసక్తికర కథనం: అత్యంత భారీగా పెరిగిన చమురు రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget