Gas Cylinder Price: గుడ్‌న్యూస్ - LPG సిలిండర్ రేటు ₹100 తగ్గింది, కొత్త రేటు ఇదే
దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు రూ. 1680కి దిగి వచ్చింది.
LPG Cylinder Latest Price In August 2023: ఎల్‌పీజీ సిలిండర్ రేటు వంద రూపాయలు తగ్గింది. ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ రేట్లను సవరించాయి. OMCలు, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మన దేశంలో LPG సిలిండర్ రేట్లను ప్రతి నెల 1వ తేదీన పెంచడం/తగ్గించడం చేస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో భాగంగా, డొమెస్టిక్ (ఇళ్లలో వాడే గ్యాస్) & కమర్షియల్ (వ్యాపారం కోసం వాడే గ్యాస్) సిలిండర్ల ధరలను ఇవాళ (01 ఆగస్టు 2023) అప్‌డేట్ చేశాయి.
కమర్షియల్ LPG సిలిండర్ రేటు ఏ నగరంలో ఎంత?
ఈసారి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీగా, 100 రూపాయలు తగ్గింది. దీంతో, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు రూ. 1680కి దిగి వచ్చింది. ఈ నెలంతా ఇదే రేటు అమల్లో ఉంటుంది. జులై నెలలో ఒక్కో సిలిండర్ కోసం రూ. 1780 ఖర్చు చేయాల్సి వచ్చింది.
దేశ రాజకీయ రాజధాని ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price) రూ. 1733.50 నుంచి రూ. 1640.50కి దిగి వచ్చింది. కోల్‌కతాలో 1802.50, చెన్నైలో రూ. 1852.50, హైదరాబాద్‌లో రూ. 1918, విజయవాడలో రూ. 1850.50 వద్దకు చేరాయి.
డొమెస్టిక్ LPG ధర పరిస్థితేంటి?
సామాన్యులు ఇళ్లలో వంటకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో (Domestic LPG Cylinder Price) OMCలు ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది మార్చి నెలలో రూ. 50 పెంచిన ఓఎంసీలు, ఆ తర్వాత ఇక తగ్గించలేదు.
ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (రెడ్ సిలిండర్) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. విజయవాడలో రూ. 1127, దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెహ్‌లో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది.
దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ రేట్లు ఒక్కోలా ఉంటాయి.
CNG, PNG ధరల్లోనూ మార్పు లేదు
దేశీయ గ్యాస్ ధర మాత్రమే కాదు, కొన్ని నెలలుగా CNG, PNG రేట్లలోనూ ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా చాలా కాలంగా మారలేదు. దేశ రాజధాని దిల్లీ సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి.
LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial