Gold-Silver Prices Today: ఏకంగా రూ.4,000 పైగా పతనమైన పసిడి - ఈ రోజు మీ ప్రాంతంలో గోల్డ్ రేటు ఎంతంటే?
Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 92,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 25,520 వద్ద ఉంది.
Latest Gold-Silver Prices 24 July 2024: భారత బడ్జెట్‌లో బంగారం, వెండి, ప్లాటినంపై పన్ను భారాలను భారీగా తగ్గించడంతో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. నిన్న (మంగళవారం) ఒక్కరోజే రూ. 2,990 పతనమైన 24 కేరెట్ల పసిడి (10 గ్రాములు) ఈ రోజు మాత్రం అదే రేటు దగ్గర కొనసాగుతోంది. దీనికి ముందు 5 రోజులుగా స్వచ్ఛమైన పసిడి రేటు పడిపోతూనే ఉంది. మొత్తంగా చూస్తే, గత వారం రోజుల్లో 10 గ్రాములకు రూ. 4,140 మేర తగ్గింది. నిన్న రూ. 2,750 తగ్గిన 22 కేరెట్ల ఆర్నమెంట్ గోల్డ్ (10 గ్రాములు) ఈ రోజు మారలేదు. గత వారం రోజుల్లో 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ రేటు రూ. 3,800 పతనమైంది.
నిన్న ఒకేసారి రూ. 3,500 పతనమైన కిలో వెండి రేటు ఈ రోజు మరో రూ. 500 తగ్గింది. ఈ వారం రోజుల్లో ఏకంగా రూ. 8,500 తగ్గింది.
యూఎస్ ఫెడ్ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి రేటు పుంజుకుంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,417 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 70,860 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 64,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,140 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 92,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 70,860 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 64,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,140 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 92,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 70,860 | ₹ 64,950 | ₹ 53,140 | ₹ 92,000 |
విజయవాడ | ₹ 70,860 | ₹ 64,950 | ₹ 53,140 | ₹ 92,000 |
విశాఖపట్నం | ₹ 70,860 | ₹ 64,950 | ₹ 53,140 | ₹ 92,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 6,490 | ₹ 7,080 |
ముంబయి | ₹ 6,495 | ₹ 7,086 |
పుణె | ₹ 6,495 | ₹ 7,086 |
దిల్లీ | ₹ 6,510 | ₹ 7,101 |
జైపుర్ | ₹ 6,510 | ₹ 7,101 |
లఖ్‌నవూ | ₹ 6,510 | ₹ 7,101 |
కోల్‌కతా | ₹ 6,495 | ₹ 7,086 |
నాగ్‌పుర్ | ₹ 6,495 | ₹ 7,086 |
బెంగళూరు | ₹ 6,495 | ₹ 7,086 |
మైసూరు | ₹ 6,495 | ₹ 7,086 |
కేరళ | ₹ 6,495 | ₹ 7,086 |
భువనేశ్వర్ | ₹ 6,495 | ₹ 7,086 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,141 | ₹ 6,637 |
షార్జా (UAE) | ₹ 6,141 | ₹ 6,637 |
అబు ధాబి (UAE) | ₹ 6,141 | ₹ 6,637 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,316 | ₹ 6,653 |
కువైట్ | ₹ 5,968 | ₹ 6,540 |
మలేసియా | ₹ 6,375 | ₹ 6,661 |
సింగపూర్ | ₹ 6,283 | ₹ 6,930 |
అమెరికా | ₹ 6,152 | ₹ 6,487 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 320 తగ్గి ₹ 25,520 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తిర కథనం: మీ పిల్లల భవిష్యత్ కోసం కొత్త స్కీమ్ - కేంద్రం ప్రకటించిన నూతన పథకం ప్రయోజనాలివి