By: ABP Desam | Updated at : 30 Sep 2023 10:20 AM (IST)
బంగారం, వెండి ధర - 30 సెప్టెంబర్ 2023
Latest Gold-Silver Price Today 30 September 2023: అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పతనం కొనసాగుతూనే ఉంది, ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,865 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర ₹ 300 స్వచ్ఛమైన పసిడి ధర ₹ 330 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 1,200 పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 53,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,200 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 53,350 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 58,200 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 76,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,470 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 53,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,200 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 53,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,350 గా నమోదైంది. జైపుర్, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 53,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,200 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 53,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,200 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 53,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,200 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 210 తగ్గి ₹ 24,160 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
EV Range Tips: ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెంచాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!
Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?
Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్ బ్రాండ్ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Adani Group Stocks: జాక్‌పాట్ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
/body>