అన్వేషించండి

Kotak Bank: ఫారిన్‌ పెట్టుబడుల మీద ఆశతో 6% పెరిగిన కోటక్‌ బ్యాంక్‌ షేర్లు

ఈ స్టాక్‌ 6% లాభపడి 1,850.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Kotak Mahindra Bank Shares: కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ కౌంటర్‌ ఇవాళ లాభాలతో కళకళలాడుతోంది. ఇవాళ (మంగళవారం, 11 ఏప్రిల్ 2023) ఉదయం 11.30 గంటల సమయానికి ఒక్కో షేర్‌ ధర రూ. 81.45 లేదా 4.66% పెరిగి రూ. 1,841 వద్ద కదులుతోంది. 

ఇవాళ, BSEలో, ఈ స్టాక్‌ 6% లాభపడి 1,850.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు, నిఫ్టీ50 ప్యాక్‌లోనూ కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఈ సమయానికి దాదాపు 36.8 లక్షల షేర్లు చేతులు మారడంతో ప్రైస్‌ యాక్షన్‌ ఎక్కువగా ఉంది.

కోటక్ మహీంద్రాబ్యాంక్‌లో ఎఫ్‌ఐఐ వాటా తగ్గింపుతో ఏర్పడిన గ్యాప్‌ కారణంగా, 690 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందువల్లే ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ స్క్రిప్‌ మీద పెట్టుబడిదార్ల ఆసక్తి పెరిగింది.

ఫారిన్‌ ఇన్‌ఫ్లోస్‌ పెరగడానికి అవకాశం
విదేశీ సంస్థాగత మదుపుదార్లు (FIIs) కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో తమ వాటాను మార్చి త్రైమాసికంలో 1.47% తగ్గించుకుని, 41.22%కి చేర్చారని తాజా షేర్‌ హోల్డింగ్ డేటా చూపిస్తోంది. దీని ఫలితంగా... ఫారిన్‌ హెడ్‌రూమ్ (విదేశీ పెట్టుబడుల అవకాశం) ప్రస్తుతమున్న 22.38% నుంచి 25.05% కు మారవచ్చని విశ్లేషకులు లెక్కలు వేశారు. అంటే.. ఫారిన్‌ ఇన్‌ఫ్లోస్‌ పెరగడానికి అవకాశం పెరిగింది.

690 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు
ఫారిన్‌ స్టేక్‌ లెక్కలు నిజమైతే & 41.22%ను ప్రస్తుత విదేశీ హోల్డింగ్‌గా MSCI పరిగణనలోకి తీసుకున్నట్లయితే... MSCI ఇండెక్స్‌లో కోటక్ మహీంద్ర బ్యాంక్ (KMB) వెయిటేజ్‌ పెరుగుతుంది. ఫలితంగా 690 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంటే, దాదాపు 3.20 కోట్ల షేర్ల కొనుగోళ్లను ఈ కౌంటర్‌లో చూడవచ్చు.

MSCI ప్రైస్‌ కటాఫ్ తేదీ మే నెల 23వ తేదీ కాగా, దాని కంటే ముందే షేర్ హోల్డింగ్ డేటాను కోటక్ మహీంద్ర బ్యాంక్‌ విడుదల చేసింది.

"ఈ స్టాక్ చాలా కాలంగా క్షీణిస్తోంది. దీని వెయిట్‌ను MSCI పెంచడం వల్ల బలమైన ర్యాలీకి దారి తీయవచ్చు, ఈ మార్పును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" - నువామా

కోటక్‌ మీంద్ర బ్యాంక్‌ స్టాక్ 2022 నవంబర్‌ నెలలో తాకిన 52 వారాల గరిష్ఠమైన రూ. 1.997.55 నుంచి దిద్దుబాటుకు గురైంది. గత ఏడాది కాలంలో, నిఫ్టీ50 ఇండెక్స్‌ ఇచ్చిన 0.3% లాభంతో  పోలిస్తే ఈ స్టాక్‌ 3% పైగా రాబడిని ఇచ్చింది, నిఫ్టీ50 ఇండెక్స్‌ను స్వల్పంగా అధిగమించింది. గత ఆరు నెలల కాలంలో కేవలం 3%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 1% మేర లాభపడింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Embed widget