Adani Group: అదానీ కంపెనీల్లో ఎవరి వాటా ఎంత? ప్రమోటర్లు దాచినదెంత, పబ్లిక్ కొన్నదెంత?
NDTV మినహా మిగిలిన 9 అదానీ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదార్లుగా ఉండగా, మొత్తం 10 కౌంటర్లలో ఎఫ్‌ఐఐల హ్యాండ్ ఉంది.
Adani Group Stocks: అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ (Hindenburg) నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. Q4FY23లో, మ్యూచువల్ ఫండ్స్ (MF) అదానీ గ్రూప్‌లోని ఆరు స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించుకోగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (ఎఫ్‌ఐఐలు) ఐదు కౌంటర్లలో తమ పెట్టుబడిలో మార్పులు చేశారు. అదానీ గ్రూప్‌లో మొత్తం 10 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. 2023 మార్చి 31 నాటికి ఉన్న డేటా ప్రకారం, NDTV మినహా మిగిలిన 9 అదానీ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదార్లుగా ఉండగా, మొత్తం 10 కౌంటర్లలో ఎఫ్‌ఐఐల హ్యాండ్ ఉంది.
2023 మార్చి 31 నాటికి, అదానీ స్టాక్స్‌లో ఎవరి వాటా ఎంత?
ఏసీసీ - ACC
ప్రమోటర్స్ హోల్డింగ్: 56.69% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 8.19% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 10.06% | పబ్లిక్ దగ్గర: 13.57%
అదానీ ఎంటర్‌ప్రైజెస్ - Adani Enterprises
ప్రమోటర్స్ హోల్డింగ్: 69.23% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.87% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 17.75% | పబ్లిక్ దగ్గర: 7.86%
అదానీ గ్రీన్ ఎనర్జీ - Adani Green Energy
ప్రమోటర్స్ హోల్డింగ్: 57.26% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.12% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 17.13% | పబ్లిక్ దగ్గర: 24.16%
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ - Adani Ports & SEZ
ప్రమోటర్స్ హోల్డింగ్: 61.03% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 3.09% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 17.99% | పబ్లిక్ దగ్గర: 7.95%
అదానీ పవర్ లిమిటెడ్ - Adani Power Ltd
ప్రమోటర్స్ హోల్డింగ్: 74.97% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.01% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 11.70% | పబ్లిక్ దగ్గర: 13.32%
అదానీ టోటల్ గ్యాస్ - Adani Total Gas
ప్రమోటర్స్ హోల్డింగ్: 74.80% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.12% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 16.31% | పబ్లిక్ దగ్గర: 2.75%
అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ - Adani Transmission Ltd
ప్రమోటర్స్ హోల్డింగ్: 71.65% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.12% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 21.05% | పబ్లిక్ దగ్గర: 3.51%
అదానీ విల్మార్ - Adani Wilmar
ప్రమోటర్స్ హోల్డింగ్: 87.94% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 0.02% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 1.27% | పబ్లిక్ దగ్గర: 10.68%
అంబుజా సిమెంట్స్ - Ambuja Cements
ప్రమోటర్స్ హోల్డింగ్: 63.21% | మ్యూచువల్ ఫండ్స్ వాటా: 5.80% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 11.16% | పబ్లిక్ దగ్గర: 10.88%
ఎన్‌డీటీవీ - NDTV
ప్రమోటర్స్ హోల్డింగ్: 69.71% | ఎఫ్‌ఐఐల యాజమాన్యం: 3% | పబ్లిక్ దగ్గర: 27.28%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.