అన్వేషించండి

ITR Filing: ఆదాయపు పన్ను చెల్లించాలా? ఇలా ఫాస్టుగా క్రెడిట్ కార్డుతో చేసేయండి

పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌ దాఖలులో వేగవంతమైన చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఎలా వినియోగించటం గురించి తెలుసుకుందాం.

Income Tax News: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులను సైతం విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ చెల్లింపులకు అనుసంధానించి వినియోగించటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటి నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం దీనిని ప్రజలు తమ పన్ను చెల్లింపు అవసరాలకు సైతం వినియోగిస్తున్నారు. 

2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్‌ దాఖలుకు ఈ నెల ఆఖరు అంటే జూలై 31, 2024 చివరి రోజు. ఒకవేళ మీరు పన్ను చెల్లింపు కిందకు రాకపోయినా రిటర్న్ ఫైల్ చేయటం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలో జూన్ 07, 2021న ప్రారంభించబడిన ఆదాయపు పన్ను పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అనేక ప్రయోజనాలను అందించటంతో పాటు ఫైలింగ్, చెల్లింపులను సులభతరం చేసింది. 

క్రెడిట్ కార్డ్‌తో టాక్స్ ఎందుకు చెల్లించాలి?
మనలో చాలా మందికి ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు సహజంగానే ఉన్నాయి. దీని ద్వారా సులువుగా ఆదాయపు పన్ను చెల్లించటానికి అధికారిక పోర్టల్ సులభరం చేయటం చాలా మందికి సౌలభ్యాన్ని అందిస్తోంది. దీని వల్ల బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేయటం వంటి అవసరం ఉండదు. ఒక్కోసారి పన్ను చెల్లింపు గడువు నాటికి చేతిలో డబ్బు లేకపోతే కార్డు ఉపయోగకరం. ఇక్కడ పన్ను చెల్లింపుదారులు పెనాల్టీల నుంచి తప్పించుకోవటానికి క్రెడిట్ కార్డు నుంచి సకాలంలో టాక్స్ చెల్లింపులు చేయవచ్చు. ఇది ఆలస్య పెనాల్టీలు, వడ్డీ వంటి సమస్యల నుంచి కాపాడుతుందని గుర్తుంచుకోండి. అలాగే వాస్తవంగా ఈ చెల్లింపుకు బ్యాంకులు బిల్లింగ్ సైకిల్ ప్రకారం అందించే 40 రోజుల గడువును ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా నిశ్చింతగా వినియోగించుకోవచ్చు కూడా. అలాగే క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయటం వల్ల తక్షణ ధృవీకరణను అందిస్తుంది.

సాధారణంగా బ్యాంక్ డిపాజిట్ లేదా చెక్కుతో చెల్లింపుల వల్ల జాప్యం జరుగుతుంది. అయితే క్రెడిట్ కార్డ్‌తో మీ పన్నులను చెల్లించడం వలన పన్ను శాఖ మీ చెల్లింపును వెంటనే ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా మీ పన్ను రికార్డులను వేగంగా నవీకరించవచ్చు.

PAN వివరాలతో లాగిన్ అవ్వటం:
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ సూటిగా ఉంటుంది. ముందుగా దీనిని ప్రారంభించటానికి పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి PAN వివరాలను అందించి లాగిన్ అవ్వాలి. తర్వాత మీకు సరిపోయే ఐటీఆర్ ఫారమ్ ఎంపిక చేసుకోవాలి. పోర్టల్ ఇప్పటికే మీ యజమానులు, బ్యాంకుల నుంచి ముందే పూరించిన సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. అవసరమైన ఇతర డేటాను అందించిన తర్వాత అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. 

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి టాక్స్ చెల్లింపు:
- ఇక్కడ పైన పేర్కొన్న వివరాలు పూరించిన తర్వాత ఐటీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రంలో మీ పన్ను మొత్తం మరియు చలాన్ క్రమ సంఖ్య వంటి వివరాలు ఉంటాయి.
-  తర్వాత “పన్ను చెల్లించండి” ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో సహా ఆదాయపు పన్ను పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివిధ పేమెంట్ ఆప్షన్స్ ఉండే పన్ను చెల్లింపు విభాగానికి వెళ్లాలి.
- మునుపటి దశలో రూపొందించబడిన చలాన్ నుండి వివరాలను ఇన్‌పుట్ చేయండి.
- అక్కడ అందుబాటులో ఉన్న వివిధ పేమెంట్ ఆప్షన్స్‌లో "క్రెడిట్ కార్డ్"ని ఎంచుకోండి. తర్వాత కార్డ్ వివరాలైన నంబర్, సీవీవీ, గడువు తేదీ అందించాలి. చివరిగా పేమెంట్ నిర్థారించే ముందు అందించిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో కొన్ని సెకన్లలోనే చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.  

* అయితే పెద్ద మెుత్తంలో టాక్స్ చెల్లింపు చేయాల్సిన వ్యక్తులకు క్రెడిట్ కార్డు ఆప్షన్ వినియోగించటానికి అవకాశం ఉండకపోవచ్చని గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు చెల్లించాల్సిన పన్ను మెుత్తం కంటే కార్డు లిమిట్ తక్కువగా ఉంటుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Embed widget