అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌లో తగ్గని రియల్‌ ఎస్టేట్ బూమ్‌- డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం చూసే వాళ్లకు షాకింగ్ న్యూస్!

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో స్థిరమైన సానుకూల సెంటిమెంట్ మధ్య 2024 తొలి త్రైమాసికంలో ప్రాపర్టీ ధరలు సగటున 10 శాతం పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ధరల్లో పెరుగుదల కనిపించింది.

Real Estate: కరోనా తర్వాత దేశంలో సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో హౌసింగ్ డిమాండ్ భారీగా పెరగటంతో ప్రధాన నగరాల్లో హౌసింగ్ బూమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా 3BHK, 4BHKలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే బిర్డర్లకు 1BHK, 2BHKలకు డిమాండ్ కొంత తగ్గటంతో పాటు వీటిలో ఎక్కువ మార్జిన్ లేకపోవటంతో ఈ సెగ్మెంట్లో ప్రాజెక్టుల లాంచ్‌కి కంపెనీలు వెనుకాడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశ స్థాయిలో విక్రయించబడని ఇన్వెంటరీలో స్వల్పంగా ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరుగుదల కనిపించింది. 

అమ్ముడుపోని ప్రాజెక్టుల్లో కదలిక

వడ్డీ రేట్లు అధికంగా కొనసాగుతున్నప్పటికీ దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో స్థిరమైన పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. 2024 తొలి త్రైమాసికంలో సగటున హౌసింగ్ ధరలు దాదాపు 10 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్, పూణేల్లో రేట్లు రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఇదే క్రమంలో దేశంలోని మిగిలిన టాప్- 8 నగరాల్లో ధరలు సగటున 2-7 శాతం మధ్య పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలో రియల్టీ ప్రాపర్టీల కొనుగోలుకు సానుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ పూణేలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 10 శాతంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో దిల్లీ, అహ్మదాబాదుల్లో ఇది 8 శాతంగా ఉంది. మెుదటి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 10 లక్షల యూనిట్లుగా నిలిచాయి.

కొత్త ప్రాజెక్టుల లాంచ్‌పై ఆచితూచి నిర్ణయం

ఇక టెక్కీలు ఎక్కువగా నివశిస్తున్న హైదరాబాద్, బెంగళూరుల్లో ఏడాది ప్రాతిపదికన అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరిగినప్పటికీ త్రైమాసికంలో ఇది స్వల్ప తగ్గుదలను చూసింది. డెవలపర్‌లు తమ కొత్త ప్రాజెక్టులను లాంచ్‌ చేయటానికి ముందు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అమ్ముడుపోని ప్రాపర్టీలు, మార్కెట్లో వినియోగదారుల నుంచి కనిపిస్తున్న డిమాండ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ప్రీమియం, లగ్జరీ గృహాలకు డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ వెల్లడించారు. పూణేలో అమ్ముడుపోని ప్రాపర్టీల సంఖ్య ఇతర నగరాల కంటే తక్కువగా నమోదైంది. 

బెంగళూరులో నీటి సమస్య 

తెలుగు ప్రజలు అధికంగా నివశించేందుకు ఇష్టపడే బెంగళూరు మహానగరంలో గృహాల ధరలు అత్యధికంగా 19 శాతం వృద్ధితో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. బెంగళూరు నగరంలో వైట్ ఫీల్డ్, కేఆర్ పురం, ఔటర్ ఈస్ట్ మైక్రో, ఔటర్ నార్త్, పెరిఫెరీ ప్రాంతాల్లో డిమాండ్, ధరల పెరుగుదల కనిపించింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే రానున్న కాలంలో వివిధ కారణాల వల్ల రియల్టీ ప్రాపర్టీల ధరలు 10-15 శాతం మధ్య పెరుగుతాయని లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ అన్నారు. ప్రస్తుతం బెంగళూరు మహానగరాన్ని నీటి ఎద్దడి సమస్య వెంటాడుతున్నప్పటికీ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. 

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు 

2024 మెుదటి మూడు నెలల కాలంలో హైదరాబాద్ నగరంలో డిసెంబర్ త్రైమాసికం కంటే ధరలు 2 శాతం పెరిగాయి. అలాగే ఏడాది ప్రాతిపదికన రేట్ల పెంపు 9 శాతంగా నమోదైంది. చదరపు అడుగుకు సగటున ధర హైదరాబాదులో 2023 మెుదటి త్రైమాసికంలో రూ.10,410గా ఉండగా అది డిసెంబర్ తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.11,083కి పెరిగింది. అలాగే 2024 తొలి త్రైమాసికంలో చదరపు అడుగుకు ధర రూ.11,323 వద్ద కొనసాగుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget