(Source: ECI/ABP News/ABP Majha)
Reliance Demerger: రిలయన్స్ షేర్‌హోల్డర్లకు ఫ్రీ షేర్లు!, ఓకే చేసిన NCLT
డీమెర్జ్ తర్వాత దీని పేరును 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్'గా (JFSL) మారుస్తారు,
Demerger of Reliance Financial Services Unit: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్‌హోల్డర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను విడదీసి (Demerge) విడిగా లిస్ట్ చేయడానికి RILకు ఆమోదం లభించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్‌హోల్డర్లు, రుణదాతలు, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ మధ్య అరేంజ్‌మెంట్స్ స్కీమ్‌కు ఓకే చెప్పింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
రిలయన్స్ ఇండస్ట్రీస్, 'రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్' (RSIL) పేరిట ఫైనాన్స్ బిజినెస్ చేస్తోంది. డీమెర్జ్ తర్వాత దీని పేరును 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్'గా (JFSL) మారుస్తారు, కొత్త పేరుతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి కల్లా ఈ ప్రాసెస్ పూర్తవుతుందని అంచనా.
NCLT నుంచి పర్మిషన్ రావడంతో, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ విభజన ప్రక్రియ వేగవంతం అవుతుంది. డీమెర్జ్ తర్వాత రిలయన్స్ షేర్‌హోల్డర్లకు ఈక్విటీ షేర్ల కేటాయింపు, లిస్టింగ్ కోసం రికార్డ్ డేట్ వంటివాటిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
తన ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరిట లిస్ట్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా కాలంగా చెబుతోంది. షేర్‌హోల్డర్లు కూడా దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఒకటికి ఒకటి, వందకు వంద షేర్లు
డీమెర్జర్ & లిస్టింగ్ తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఫ్రీగా లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, RILలో హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక్క షేర్‌కు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ (1:1 రేషియో) వస్తుంది. ఒక షేర్‌హోల్డర్ దగ్గర 100 రిలయన్స్ షేర్లు ఉంటే, అతనికి 100 జియో ఫైనాన్షియల్ షేర్లు ఉచితంగా యాడ్ అవుతాయి.
రిలయన్స్, భారతదేశంలో అతి పెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ & అతి పెద్ద రిటైలర్. ఈ వ్యాపారాల ద్వారా రిలయన్స్ కస్టమర్ల బేస్ కోట్లలో ఉంది. కొత్త ఆర్థిక సేవల వ్యాపారాన్ని బాగా పెంచుకోవడాని, విస్తరించడానికి ఈ కస్టమర్ బేస్ చాలా ఉపయోగపడుతుంది.
రిటైల్, టెలీ కమ్యూనికేషన్స్ సెగ్మెంట్లను డీమెర్జ్ చేసి, ఐదేళ్లలో లిస్ట్ చేస్తామని, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ (Mukesh Ambani) 2019లోనే ప్రకటించారు. ఎందుకంటే, ఆ వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయి, వాటి పరిధిని పెంచుకుంటూ విస్తరిస్తున్నాయి. కాబట్టి, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్లుగా డీమెర్జర్ అడుగులు వేస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Titan, RIL, Sobha
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial