ITR Filing Last Date: నేటితో ముగియనున్న గడువు.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఈ సమస్యలు తప్పవు..!
ITR 2020-21 Filing Last Date: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి తుది గడువు నేటితో ముగియనుంది. ఐటీఆర్ ఫైల్ చేసే గడువును పెంచిన కేంద్రం చివరగా డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా స్పష్టం చేసింది.
ITR Filing Last Date: మీరు వ్యాపారం, లేక ఉద్యోగం చేస్తున్నారా? మీకు ప్రతి ఏడాది ఆదాయపు పన్ను కట్టే అలవాటుందా.. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి తుది గడువు నేటితో ముగియనుంది. గతంలో పలుమార్లు ఐటీఆర్ ఫైల్ చేసే గడువును పెంచిన కేంద్రం చివరగా డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా స్పష్టం చేసింది.
ఐటీఆర్ 2020-21 దాఖలు చేయకపోతే మాత్రం ఇబ్బందులు కొన్ని సమస్యలు తప్పవు. నిర్ణీత గడువులోగా అంటే నేడు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తరువాత ఐటీఆర్ ఫైల్ చెల్లించాలంటే రూ.10 వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. కనుక గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఈ జరిమానా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆంగ్ల సంవత్సరాన్ని ప్రశాంతంగా ప్రారంభించవచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేయక తప్పదు. ఆలస్యంగా చెల్లిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం అందుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234బీ ప్రకారం పన్ను చెల్లింపుదారులు సరైన తీరుగా మొత్తం ట్యాక్స్ చెల్లించకపోతే.. చెల్లించాల్సిన దాని కన్నా 90 శాతం తక్కువ కట్టినా నెలకు 1 శాతం వడ్డీ పెనాల్టీ వేస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే బదులు నేడు ఐటీఆర్ సకాలంలో పైల్ చేయండి.
ఆన్‌లైన్‌లో ఈ నెల మొదట్నుంచీ రోజుకు 3 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు ఐటీ రటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు సరిగ్గా పన్ను చెల్లించని పక్షంలో వచ్చే ఏడాది పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది, మీ ఖర్చులు మరింత భారంగా మారతాయి. కొన్ని రకాల లోన్లు తీసుకోవాలనే వారికి లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లోన్ కోసం దరఖాస్తు చేస్తే గడిచిన మూడేళ్ల ఐటీఆర్ వివరాలు బ్యాంకులు చెక్ చేస్తాయి. ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే పలు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందలేకపోవచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సినవి ఇవే..
- ఐటీఆర్ దాఖలు చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కావాలి
- ఫారం-16 పార్ట్A, పార్ట్-B
- టీడీఎస్ సర్టిఫికెట్
- ఏడాది చేసే ఖర్చులకు సంబంధించిన కొన్ని పత్రాలు
- ఫైల్ చేసే సమయంలో రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీతో ఉండాలి
ఐటీఆర్ ఫైల్ చేసుకునే విధానం ఇదే..
- మొదట ఆదాయపన్ను వెబ్‌సైట్ Click Here To File ITR కు వెళ్లాలి.
- హోం పేజీలో 'లాగిన్'ను క్లిక్ చేయండి.
- 'Enter Your User ID' వద్ద మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేయండి.
- 'సెక్యూర్ యాక్సెస్ మెసేజ్' రాగానే కంటిన్యూ మీద నొక్కండి.
- టెక్ట్స్ మెసేజ్ లేదా వాయిస్ కాల్ ద్వారా మీరు ఆరు అంకెల ఓటీపీని పొందొచ్చు.
- మీ నమోదిత ఆధార్ నంబర్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొనీ ఐటీ వెబ్‌పోర్టల్‌లో లాగిన్ కావొచ్చు.
- మీరు ఆధార్ ఉపయోగిస్తే మీ నంబర్, ఓటీపీని సైట్లో ఎంటర్ చేయాలి.
- నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
- లాగిన్ ప్రక్రియ ముగియగానే 2021-22 ఏడాది అసెస్‌మెంట్ ఐటీఆర్ సమర్పించొచ్చు.
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: AP Omicron Cases: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్