చౌకగా దొరుకుతున్న ఐటీ స్టాక్స్‌ను ఇప్పుడు కొనొచ్చా?
IT Stocks: కొంతకాలంగా ఐటీ స్టాక్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. నిఫ్టీలోని 10 IT కౌంటర్లలో 4, వాటి 5 సంవత్సరాల సగటు PE స్థాయిల కంటే దిగువన ట్రేడవుతున్నాయి.
ఇన్ఫోసిస్ స్టాక్, దాని ఆల్-టైమ్ హై లెవెల్ నుంచి 35% పైగా పడిపోయింది. 5 సంవత్సరాల సగటు PE 25.59 అయితే, ప్రస్తుతం 21.71 PE వద్ద, డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. IT మేజర్ TCS కూడా గరిష్ట స్థాయి నుంచి 22% పైగా క్షీణించింది. దాని 5 సంవత్సరాల సగటు PE 29 కంటే తక్కువగా 27 PE వద్ద దొరుకుతోంది. తగినంతమంది కొనుగోలుదార్లు లేదా డిమాండ్ వీటికి దొరకడం లేదని దీని అర్ధం. యంఫసిస్, విప్రో కూడా వాటి ఐదేళ్ల సగటు PE స్థాయిల కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండూ గరిష్ట స్థాయి నుంచి సగానికి పైగా పడిపోయాయి.
అన్ని నిఫ్టీ IT స్టాక్స్‌లో పెర్సిస్టెంట్ సిస్టమ్ కొంత మెరుగ్గా ఉంది, ఇది కేవలం 15% తగ్గింది. దాని సగటు వాల్యుయేషన్ కంటే పైనే ట్రేడవుతోంది.
చాలా బ్రోకరేజ్‌లు ఐటీ స్టాక్స్ మీద ప్రస్తుతానికి బేరిష్‌గా ఉన్నాయి. ప్రపంచ అనిశ్చితుల కారణంగా, ఐటీ కంపెనీల భవిష్యత్ మీద మబ్బులు కమ్ముకున్నాయని చెబుతున్నాయి. ఐటీ స్టాక్స్‌కు ఇచ్చిన రేటింగ్స్ తగ్గిస్తున్నాయి.
10 ఐటీ స్టాక్స్, వాటి పతన స్థాయి:
విప్రో - Wipro
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 50
TTM PE: 17.75
ఐదేళ్ల సగటు PE: 18.42
టెక్ మహీంద్ర - Tech Mahindra
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 44
TTM PE: 19.13
ఐదేళ్ల సగటు PE: 17.26
హెచ్‌సీఎల్ టెక్ - HCL Tech
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 23
TTM PE: 19.96
ఐదేళ్ల సగటు PE: 17.62
యంఫసిస్ - Mphasis
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 51
TTM PE: 20.67
ఐదేళ్ల సగటు PE: 23.76
ఇన్ఫోసిస్ - Infosys
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 35
TTM PE: 21.71
ఐదేళ్ల సగటు PE: 25.59
టీసీఎస్ - TCS
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 23
TTM PE: 27.18
ఐదేళ్ల సగటు PE: 28.95
కోఫోర్జ్ - Coforge
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 34
TTM PE: 31.24
ఐదేళ్ల సగటు PE: 27.08
ఎల్‌టీఎస్‌ఎస్ - LTSS
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 42
TTM PE: 32.49
ఐదేళ్ల సగటు PE: 31.91
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ - Persistent
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 15
TTM PE: 38.19
ఐదేళ్ల సగటు PE: 25.81
ఎల్‌టీ మైండ్‌ట్రీ - LTIMindtree
ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 43
TTM PE: 43.28
ఐదేళ్ల సగటు PE: 27.99
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Brand Value: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ TCS, సెకండ్ ప్లేస్‌లో రిలయన్స్
GDP: భారత్ ఒక సూపర్ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు
Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్
Stocks Watch Today, 01 June 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Coal India, HDFC Life
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!
Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్
కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్, సోది ఆపు: పీవీపీ