అన్వేషించండి

IT Stocks: పగ తీర్చుకుంటున్న ఐటీ స్టాక్స్‌, ఈ ఉత్సాహం ఎంతకాలం ఉండొచ్చు బ్రదర్‌?

కొత్త క్యాలెండర్ సంవత్సరం 2023 మొదటి రెండు వారాల్లో HCL టెక్‌ 7%, TCS 3.7%, ఇన్ఫోసిస్ 2% పెరిగింది.

IT Stocks: 2022లో అత్యంత చెత్త పెర్ఫార్మెన్స్‌ చేసిన IT స్టాక్స్‌, ఇప్పుడు బౌన్స్ అవుతున్నాయి. 26% క్రాష్‌తో ఆ సంవత్సరాన్ని ఒక చేదు జ్ఞాపకంగా ముగించిన IT బారో మీటర్, 2023 మొదటి పక్షం రోజుల్లో అత్యధికంగా లాభపడింది. అయితే, దీనిని పాజిటివ్‌ ట్రెండ్‌గా పిలిస్తే, అది మన తొందరపాటే అవుతుంది.

హాట్‌ కేకుల్లా ఐటీ స్టాక్స్‌
గత నెలలో (డిసెంబర్‌), బ్రోకరేజ్‌ల టార్గెట్‌ ధరల్లో TCS 4 డౌన్‌గ్రేడ్‌లు, విప్రో 3 డౌన్‌గ్రేడ్‌లు, HCL టెక్నాలజీస్‌ 2 డౌన్‌గ్రేడ్లను చూసాయి. అయితే, డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత అవి పుంజుకున్నాయి. కొత్త క్యాలెండర్ సంవత్సరం 2023 మొదటి రెండు వారాల్లో... HCL టెక్‌ 7%, TCS 3.7%, ఇన్ఫోసిస్ 2% పెరిగింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ (Nifty IT Index) కూడా 3% పైగా పెరిగింది. మొత్తం ఇదే కాలంలో నిఫ్టీ50, తన విలువలో 0.3% కోల్పోయింది.

"ప్రస్తుతం ఐటీ స్టాక్స్‌లో 'బాటమ్‌ ఫిషింగ్' (కనిష్ట ధరల వద్ద కొనుగోళ్లు) జరుగుతోంది. అమ్మకాల ఒత్తిడి తగ్గడం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ స్టాక్స్‌ అట్టడుగు స్థాయికి పడిపోయాయని భావిస్తున్నాం, ఇంతకుమించి పతనం ఉంటుందని  అనుకోవట్లేదు" ని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌కి చెందిన క్రాంతి బథి చెప్పారు.

ఇండియన్‌ IT స్టాక్‌ల పనితీరు మీద అమెరికన్‌ నాస్‌డాక్‌ కాంపోజిట్‌ (Nasdaq) ప్రభావం కూడా స్పష్టంగా ఉంటుంది. నాస్‌డాక్‌, గత 2 వారాల్లో 6% పైగా ర్యాలీ చేసింది. 

'జాగ్రత్త సుమా' అంటున్న జెఫరీస్‌
గ్లోబల్ బ్రోకరేజ్ జెఫరీస్ కూడా ఇండియన్‌ ఐటీ సెక్టార్‌ మీద మరీ ఎక్కువ సానుకూలంగా మాత్రం లేదు. Q3లో మంచి నంబర్లను ఐటీ కంపెనీలు పోస్ట్‌ చేసినా, ఆ రంగం మీద తమ "కాషన్‌ వ్యూ"ని మార్చుకునేందుకు పెద్ద కారణాలేమీ కనపడడం లేదని జెఫరీస్ ఎనలిస్ట్‌ అక్షత్ అగర్వాల్ చెప్పారు. ఐటీ సెక్టార్‌లో అనిశ్చిత కాలం ఇంకా ముగియలేదని అన్నారు. ఇప్పటి వరకు క్యూ3 ఫలితాలు ప్రకటించిన అన్ని ఐటీ సంస్థల్లో TCS Q3 పనితీరు బలంగా ఉందని, విప్రో బలహీనంగా ఉందని అగర్వాల్ ఒక నివేదిక ద్వారా వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, జెఫరీస్ నుంచి "బయ్‌" రేటింగ్‌ కలిగి ఉన్న ఏకైక ఐటీ స్టాక్ ఇన్ఫోసిస్.

ఇప్పుడు, నిఫ్టీ50తో పోలిస్తే IT సెక్టార్‌ 15% ప్రీమియంతో ట్రేడవుతుందో. IT రంగం చారిత్రక సగటు 8% తో పోల్చినా ప్రీమియంలో ఉంది. కాబట్టి, స్టాక్స్‌లో ర్యాలీ పెద్దగా ఉండకపోచ్చని విశ్లేషకులు అంటున్నారు.

లార్జ్‌ క్యాప్‌ ఐటీ స్టాక్స్‌లో, HCL టెక్నాలజీస్‌ను తన టాప్‌ పిక్‌గా బ్రోకరేజ్‌ మాక్వేరీ వెల్లడించింది, రూ. 1,500 టార్గెట్ ధర ఇచ్చింది. మిడ్‌ క్యాప్ సెగ్మెంట్‌లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ & LTIMindtree ఈ బ్రోకరేజ్‌ అగ్ర ఎంపికలు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget