By: Rama Krishna Paladi | Updated at : 19 Jul 2023 05:06 PM (IST)
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీవో ( Image Source : www.facebook.com/netwebindia/photos )
Netweb Technologies IPO:
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు భారీ స్పందన లభించింది. ఆఫర్‌ను అందిపుచ్చుకొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. పబ్లిక్ ఇష్యూ చివరి రోజైన బుధవారం నాటికి 90.1 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మొత్తం ఐపీవో పరిమాణం 88.58 లక్షల ఈక్విటీ షేర్లు కాగా 79.71 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలవ్వడం గమనార్హం.
ఇదీ డిమాండ్!
కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉండటం, వాల్యుయేషన్లు సహేతుకంగా కనిపించడం, మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నెట్‌వెబ్ టెక్నాలజీ ఐపీవోకు విపరీతమైన స్పందన వచ్చింది. ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 50 శాతం వాటా కేటాయించగా 228.91 రెట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఐపీవోలో 15 శాతం కేటాయించగా అధిక నెట్‌వర్త్ సంపన్నులు 81.71 రెట్లు బిడ్లు వేశారు. ఉద్యోగుల కోటాలో 20,000 ఈక్విటీ షేర్లు ఉండగా 49.93 రెట్లు డిమాండ్ వచ్చింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు 18.7 రెట్లు ఎక్కువగా బిడ్లు వేశారు.
మార్క్వీ ఇన్వెస్టర్లు
నెట్‌వెబ్ టెక్నాలజీస్ మొదట 1.26 కోట్ల షేర్లతో ఐపీవోకు రావాలని భావించింది. జులై 14న క్యూఐబీ కోటాలో యాంకర్ బుక్ ద్వారా రూ.189 కోట్లు సమీకరించడంతో 88.58 లక్షల షేర్లకు పరిమాణాన్ని తగ్గించింది. ఈస్ట్‌స్ప్రింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ఫండ్, నొమురా ఫండ్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, గోల్డ్‌మన్ సాచెస్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ, వైట్‌ఓక్ క్యాపిటల్ మార్క్వీ ఇన్వెస్టర్లుగా ఉన్నారు.
ఇష్యూ విలువ రూ.631 కోట్లు
కంపెనీ రూ.631 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ప్రెష్ ఇష్యూ ద్వారా రూ.206 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.425 కోట్లు సమీకరిస్తున్నారు. షేర్ల ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించారు. ఐపీవోకు ముందే ప్రీ ఐపీవో ప్లేస్‌మెంట్ ద్వారా రూ.51 కోట్లు సేకరించారు. ఈ డబ్బును సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (SMT) లైన్ డెవలప్‌మెంట్, లాంగ్‌టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అప్పులు చెల్లించడం, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం ఉపయోగించనున్నారు. సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ప్రైవేట్ క్లౌడ్, హైపర్ కన్వర్జుడ్ ఇన్ఫ్రా, డేటా సెంటర్ సర్వర్లు, ఏఐ సిస్టమ్స్, ఎంటర్‌ప్రైస్ వర్క్‌స్టేషన్స్, హెచ్‌పీఎస్ సొల్యూషన్స్ వంటి సేవలను నెట్‌వెబ్ టెక్నాలజీస్ అందిస్తోంది. సూపర్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్, హెచ్‌సీఐ ద్వారానే 70 శాతం వ్యాపారం జరుగుతోంది.
ఆదాయం, లాభం వివరాలు
నెట్‌వెబ్ టెక్నాలజీస్ 2023, మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ.445 కోట్ల ఆదాయం నమోదు చేసింది. నికర లాభం రూ.46.9 కోట్లు. 2021-23 ఆర్థిక ఏడాదిలో సీఏజీఆర్ వృద్ధి 76.6 నుంచి 138 శాతానికి పెరిగింది. 2021లో ఆర్డర్ బుక్ విలువ రూ.48.56 కోట్లు ఉండగా 2023కు రూ.90.2 కోట్లకు చేరుకుంది.
Also Read: టాక్స్ పేయర్స్ చైతన్యం! 7 రోజులు ముందుగానే 3 కోట్ల ఐటీఆర్‌లు ఫైలింగ్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు
Amaravati Works News: అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
Mahesh Babu: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు