By: Rama Krishna Paladi | Updated at : 19 Jul 2023 02:26 PM (IST)
ఐటీఆర్ ఫైలింగ్ రికార్డులు ( Image Source : Pexels )
IT Returns:
ఒకప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) అంటేనే చాలామంది వాయిదా వేసేవారు! ఆఖరి పది రోజుల్లో చూసుకుందాంలే అని భావించేవారు. ఎవరో ఒకర్ని పట్టుకొని పనికానిచ్చేద్దాం అనుకొనేవారు! అలాంటిది ఈసారి ఆదాయపన్ను ఫైలింగ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కీలక మైలురాళ్లు ఈసారి ముందుగానే అధిగమిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సులువుగా ఫైల్ చేసుకోవడం, ఆఖరి వరకు వేచి చూసే ధోరణి తగ్గడం, ఐటీఆర్ ఫైలింగ్ సరళతరం కావడమే ఇందుకు కారణాలు!
Grateful to our taxpayers & tax professionals for having helped us reach the milestone of 3 crore Income Tax Returns (ITRs), 7 days early this year, compared to the preceding year!
— Income Tax India (@IncomeTaxIndia) July 19, 2023
Over 3 crore ITRs for AY 2023-24 have already been filed till 18th of July this year as compared… pic.twitter.com/jcGyirW2wa
పన్ను చెల్లింపుదారులు (Income Tax Payers) ఈసారి చైతన్యం ప్రదర్శిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఏడు రోజులు ముందుగానే మూడు కోట్ల మంది ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేశారు. అందుకే పన్ను చెల్లింపుదారులు, టాక్స్ ప్రొఫెషనల్స్‌కు ఐటీ శాఖ ధన్యవాదాలు తెలియజేసింది. 2023 జులై 18కే 2023-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి మూడు కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. గతేడాది ఇందుకు జులై 25 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
2023, జులై 18 నాటికి 3.06 కోట్ల ఐటీఆర్‌లు (ITR) ఫైల్ చేయగా ఇందులో 2.81 కోట్ల ఐటీఆర్‌లు ఇప్పటికే ఈ-వెరిఫై అయ్యాయి. అంటే 91 శాతం పూర్తయ్యాయి. ఇక ఈ-వెరిఫై (Income Tax) అయినవాటిలో 1.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశామని ఐటీ శాఖ వెల్లడించింది. మూమెంటమ్ ఇలాగే కొనసాగాలని, ఆఖరి నిమిషం వరకు ఎదురు చూడకుండా త్వరగా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.
కోటి, రెండు కోట్ల ఐటీఆర్ ఫైలింగ్ రికార్డులు సైతం ఈసారి బద్దలైన సంగతి తెలిసిందే. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి జులై 11 వరకు మొత్తం 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 9 రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకున్నాం. 2022 జులై 8 నాటికి ఒక కోటి నంబర్ కనిపించింది. అంటే, 2022తో పోలిస్తే 2023లో ఒక కోటి ITRల మైలురాయిని 12 రోజుల ముందే చేరుకున్నట్లయింది.
We are happy to inform that over 2 crore Income Tax Returns (ITRs) for AY 2023-24 have already been filed till 11th of July this year as compared to 2 crore ITRs filed till 20th of July last year.
— Income Tax India (@IncomeTaxIndia) July 11, 2023
Our taxpayers have helped us reach the 2 crore milestone 9 days early this year,… pic.twitter.com/ZlOAKeJpWR
ITR ఫైలింగ్ లాస్ట్ డేట్ జూలై 31
2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. ఇంకా పది రోజుల సమయమే మిగిలుంది. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా ITRలు ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను విభాగం తరచూ గుర్తు చేస్తోంది.
Also Read: ఆషాఢంలో వెండి రికార్డు! ఇక శ్రావణంలో కిలో రూ.85,000 చేరడం పక్కా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy