By: ABP Desam | Updated at : 13 May 2022 05:42 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్ఐసీ ఐపీవో ( Image Source : Getty )
LIC IPO: ఎల్ఐసీ ఇష్యూ ధరను కంపెనీ రూ.949గా నిర్ణయించినట్టు తెలిసింది. అప్పర్ బ్యాండ్ ధరకే షేర్లను కేటాయిస్తున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్దదైన ఈ ఐపీవోకు అంచనాలకు మించే స్పందన లభించింది. షేర్ల కేటాయింపు జరగని వాళ్లకే శుక్రవారం నుంచే రీఫండ్ మొదలైంది. కేటాయింపు చేసిన వారికి సోమవారం డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. బహుశా ఆ మరుసటి రోజే లిస్టింగ్ అవుతుందని అంటున్నారు.
ఎల్ఐసీ ఇష్యూ మే 4న మొదలైంది. 9న ముగిసింది. ధరల శ్రేణిని రూ.902-949గా నిర్ణయించారు. బిడ్డింగ్ వేసేందుకు చివరి రోజైన సోమవారం నాటికి 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. పాలసీ హోల్డర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల నుంచి ఈ ఐపీవోకు మంచి స్పందన లభించింది. యాంకర్ బుక్‌ను మినహాయిస్తే 162 మిలియన్ షేర్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఏకంగా 478.3 మిలియన్ల షేర్లకు బిడ్డింగ్స్ వచ్చాయి.
ఈ ఇష్యూకు 7.3 మిలియన్ల కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దాంతో 14 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్ల అమ్మకం రికార్డును బ్రేక్ చేసింది. 2008లో ఆ ఇష్యూకు 4.8 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకోగా ఎల్‌ఐసీకి 7.3 మిలియన్ల మంది బిడ్డింగ్ వేయడం గమనార్హం.
ఎల్ఐసీ వివరాలు
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్‌స్క్రిప్షన్ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy