By: ABP Desam | Updated at : 07 May 2022 09:17 PM (IST)
ఎల్ఐసీ ఐపీవో
LIC IPO: భారతీయ జీవిత బీమా (LIC IPO) ఐపీవోకు స్పందన బాగా వస్తోంది. ఇష్యూ నాలుగో రోజూ ఇన్వెస్టర్లు ఐపీవోకు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.5 రెట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మే 4న మొదలైన ఇష్యూ 9న ముగియనుంది.
ఎల్‌ఐసీ 16,20,78,067 షేర్లకు బిడ్లు పిలవగా ఇప్పటి వరకు 24,33,13,395 ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అంటే మొత్తంగా 1.5 రెట్లు స్పందన లభించింది. రిటైల్, ఉద్యోగులు, పాలసీ హోల్డర్లు సహా మొత్తం ఐదు కోటాల్లో వంద శాతం సబ్‌స్క్రైబ్ చేశారు. పాలసీ హోల్డర్ల కోటాకు 4.6 రెట్లు, ఉద్యోగుల కోటాకు 3.31 రెట్లు స్పందన వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కోటాకు 0.67 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటాకు 0.87 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
ఎల్ఐసీ వివరాలు
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్‌స్క్రిప్షన్ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?