By: Rama Krishna Paladi | Updated at : 04 Aug 2023 02:10 PM (IST)
కాన్‌కార్డ్ బయోటెక్ ఐపీవో ( Image Source : Twitter )
Concord Biotech IPO:
ఐపీవో ఇన్వెస్టర్లకు శుభవార్త! ఫార్మా రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కాన్‌కార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ (Concord Biotech IPO) మొదలైంది. శుక్రవారం నుంచే బిడ్డింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 8న ముగుస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1551 కోట్లను కంపెనీ సమీకరిస్తోంది. ఒక్కో షేరుకు రూ.705-741 ధరల శ్రేణిగా నిర్ణయించింది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఇప్పటికే ఈ షేర్లకు డిమాండ్ పెరిగింది. గ్రే మార్కెట్లో రూ.150 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి.
Concord Biotech IPO GMP today: మార్కెట్ అనలిస్టుల ప్రకారం కాన్‌కార్డ్ బయోటెక్ షేర్లు గ్రే మార్కెట్లో రూ.150 వద్ద ట్రేడవుతున్నాయి.
Concord Biotech IPO price band: కంపెనీ ఒక్కో షేరుకు ₹705 to ₹741 ధరల శ్రేణి నిర్ణయించింది.
Concord Biotech IPO date: శుక్రవారం మొదలైన ఐపీవో బిడ్డింగ్ ఆగస్టు 8న ముగుస్తుంది.
Concord Biotech IPO lot size: కాన్‌కార్డ్ బయోటెక్ ఐపీవో లాట్ సైజ్ 20 షేర్లు. రూ.14,820 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Concord Biotech IPO size: ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1551 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసుకుంది.
Concord Biotech IPO allotment date: ఆగస్టు 11న షేర్లను కేటాయిస్తారు.
Concord Biotech IPO registrar: లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఈ ఐపీవోకు రిజిస్ట్రార్.
Concord Biotech IPO listing: కాన్‌కార్డ్ బయోటెక్ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో నమోదు అవుతాయి.
Concord Biotech IPO listing date: కాన్‌కార్డ్ బయోటెక్ షేర్లు ఆగస్టు 18న మార్కెట్లో నమోదు అవుతాయి.
సబ్‌స్క్రైబ్ రేటింగ్
కాన్‌కార్డ్ బయోటెక్ ఐపీవోకు స్టాక్ బ్రోకర్లు సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇస్తున్నారు. 'అధిక ధరల శ్రేణి వద్ద కాన్‌కార్డ్ బయోటెక్ 32.3 రెట్ల పీఈ మల్టిపుల్ కోరుతోంది. పోటీ కంపెనీలతో పోలిస్తే డిస్కౌంట్‌కే లభిస్తున్నాయి. ఇమ్యూనాలజీ, ఆంకాలజీ, యాంటీ ఇన్‌ఫెక్టివ్ థెరపాటిక్ విభాగాల్లో ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఫెర్మెంటెడ్ ఏపీఐకి మంచి డిమాండ్ ఉంది. కంపెనీ తయారీ సామర్థ్యం, ప్లాంట్ లోకేషన్లు విస్తరణకు అనుకూలంగా ఉన్నాయి. అందుకే మేం సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇస్తున్నాం' అని చాయిస్ బ్రోకింగ్ తెలిపింది. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ ఉండటం, ఆర్ అండ్ డీ, నాయకత్వ బృందం సామర్థ్యం వల్ల తామూ సానుకూల రేటింగే ఇస్తున్నామని రిలయన్స్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
కాన్‌కార్డ్ బయోటెక్ కంపెనీలో బిగ్‌బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కంపెనీకి వాటా ఉంది. 2004లో 24.09 శాతం వాటా కొనుగోలు చేశారు. ఇప్పుడిది ఆయన సతీమణి రేఖా నియంత్రణలోకి వచ్చింది.
Also Read: మీకు రూ.15,490 రీఫండ్ వస్తోంది! ఆ మెసేజ్ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి