By: ABP Desam | Updated at : 03 Apr 2023 11:56 AM (IST)
Edited By: Arunmali
అవలాన్ టెక్నాలజీస్ ఐపీవో స్టార్టయింది, బిడ్ వేద్దామా?
Avalon Technologies IPO: ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అవలాన్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నేటి (సోమవారం, 03 ఏప్రిల్ 2023) నుంచి ఓపెన్ అయింది, సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి గురువారం (ఏప్రిల్ 6, 2023) వరకు అవకాశం ఉంది.
ప్రైస్ బ్యాండ్
ఈ ఇష్యూలో, ఒక్కో షేరుకు రూ. 412-436 ధరను కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు 34 షేర్లను కేటాయించింది. పెట్టుబడిదార్లు లాట్ల రూపంలో (34 గుణిజాల్లో) బిడ్ వేయాలి.
ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 865 కోట్లు (IPO సైజ్) సేకరించాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ను కంపెనీ ప్రారంభించింది. శుక్రవారం నాడు (2023 మార్చి 31) జరిగిన ప్రి-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ కంపెనీ రూ. 160 కోట్లు కూడగట్టడంతో ఐపీఓ పరిమాణం గతంలోని రూ. 1,025 కోట్ల నుంచి ఇప్పటి రూ. 865 కోట్లకు తగ్గింది.
ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ. 320 కోట్లు సమీకరించబోతోంది. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదార్ల నుంచి మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో విక్రయిస్తుంది. OFS కింద.. ప్రమోటర్లు కున్హమద్ బిచా, భాస్కర్ శ్రీనివాసన్ వరుసగా రూ. 131 కోట్లు, రూ.172 కోట్ల వరకు షేర్లను విక్రయిస్తారు. ప్రమోటర్ గ్రూప్‌లోని మరికొందరు కూడా షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తారు.
ఫ్రెష్ ఈక్విటీ సేల్స్ ద్వారా వచ్చే రూ. 320 కోట్లు మాత్రమే కంపెనీ ఖాతాలోకి చేరుతాయి. రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తామని సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో (DRHP) ఈ కంపెనీ వెల్లడించింది.
IPOలో.. అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్ల (QIBలు) కోసం 75% షేర్లను రిజర్వ్ చేశారు. 15% షేర్లు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIలు), మిగిలిన 10% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం... ఐపీవో ప్రారంభానికి ముందు, అన్ లిస్టెడ్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ. 8-10 ప్రీమియంతో చేతులు మారాయి.
కంపెనీ వ్యాపారం - లాభనష్టాలు
ఎండ్-టు-ఎండ్ సర్వీస్ సొల్యూషన్స్‌ను అందించే సమగ్ర ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అవలాన్ టెక్నాలజీస్. ఈ కంపెనీకి US, భారతదేశంలో 12 తయారీ యూనిట్లు ఉన్నాయి. క్యోసాన్ ఇండియా, జోనార్ సిస్టమ్స్ ఇంక్, కాలిన్స్ ఏరోస్పేస్, ఇ-ఇన్ఫోచిప్స్ వంటి పెద్ద కంపెనీలు ఈ కంపెనీ కీలక క్లయింట్ లిస్ట్‌లో ఉన్నాయి.
కేబుల్ అసెంబ్లీ & వైర్ హార్నెస్, షీట్ మెటల్ ఫాబ్రికేషన్, మెషీనింగ్, మాగ్నెటిక్స్, ఇంజెక్షన్ మోల్డ్ ప్లాస్టిక్స్ బిజినెస్ కూడా ఈ కంపెనీ చేస్తోంది.
2022 నవంబర్‌తో ముగిసిన కాలానికి ఈ కంపెనీ రూ. 584 కోట్ల ఆదాయం సంపాదించింది. దీనిపై, పన్ను తర్వాతి లాభం (PAT) రూపంలో రూ. 34 కోట్లు మిగిలింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్ క్లియర్ - ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే?
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?