By: ABP Desam | Updated at : 07 Mar 2023 09:30 AM (IST)
Edited By: Arunmali
ఎయిరోక్స్ టెక్నాలజీస్ ఐపీవో రద్దు
Airox Technologies IPO: భారతీయ స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా, దలాల్ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టకుండానే మరో కంపెనీ వెనక్కు వెళ్లిపోయింది. వైద్య పరికరాల తయారీ సంస్థ ఎయిరోక్స్ టెక్నాలజీస్ (Airox Technologies) తన ఐపీవో ప్రణాళికను రద్దు చేసుకుంది. IPO (Initial Public Offering) ద్వారా రూ. 750 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ భావించింది.
ఎయిరోక్స్ టెక్నాలజీస్, తన ప్రతిపాదిత IPO కోసం సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) 30 సెప్టెంబర్ 2022న డ్రాఫ్ట్ పేపర్ దాఖలు చేసింది.
ఎయిరోక్స్ టెక్నాలజీస్ కంపెనీ ప్రమోటర్లు భరత్‌కుమార్ జైస్వాల్, అషిమా సంజయ్ జైస్వాల్ తమ వాటాల్లో కొంత భాగాన్ని ఈ IPO ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో విక్రయించాలని భావించారు.
IPO రద్దుపై వెల్లడికాని కారణాలు
SEBI వెబ్‌సైట్‌లో చూసిన అప్‌డేట్ ప్రకారం... IPOని తీసుకురావడానికి దాఖలు చేసిన డ్రాఫ్ట్ ఆఫర్ పత్రాలు గత నెలాఖరులో, అంటే ఫిబ్రవరి 28, 2023న ఎయిరోక్స్ టెక్నాలజీస్ ఉపసంహరించుకుంది. అయితే ఐపీఓ ఉపసంహరణ వెనకున్న కారణాలను మాత్రం ఈ కంపెనీ వెల్లడించలేదు.
ఔరంగాబాద్ కేంద్రంగా పని చేసే ఎయిరోక్స్ టెక్నాలజీస్, PSA ఆక్సిజన్ జనరేటర్ల (PSA Oxygen Generator) తయారీ సంస్థ. 2022 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి, PSA మెడికల్ ఆక్సిజన్ మార్కెట్‌లో ఈ కంపెనీకి 50 నుంచి 55 శాతం వాటా ఉంది.
2022 మార్చి చివరి నాటికి, 872 PSA ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. PSA ఆక్సిజన్ జనరేటర్లు, గాలిలోని నైట్రోజన్ వాయువును తొలగించడం ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ యంత్రాలు తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ అందించడంలో సహాయపడతాయి.
అంతకుముందు రెండు కంపెనీలు
ఇంతకుముందు, దుస్తుల రిటైల్ కంపెనీ ఫ్యాబ్ ఇండియా (Fabindia) కూడా తన IPO ప్రతిపాదనను కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేసింది. జ్యువెలరీ కంపెనీ జోయాలుక్కాస్ (Joyalukkas) కూడా తన IPO ప్లాన్‌ను రద్దు చేసుకుంది. IPO ద్వారా 482.43 మిలియన్ డాలర్లు లేదా రూ. 4000 కోట్లు సమీకరించాలని ఫ్యాబ్‌ఇండియా గతంలో నిర్ణయించింది. జోయాలుక్కాస్ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించాలని భావించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో