Zomato: క్యూలైన్‌లో నిలబడాలంటే చిరాకు పుట్టింది... జొమాటో యాప్ వచ్చింది...
ఏమైనా తినాలనిపిస్తే ఠక్కున గుర్తుకోచ్చేది జొమాటో. అంతలా జనాల్లోకి చొచ్చుకెళ్లిపోయింది. ఫుడ్ డెలవరీలోనే కాదు... షేర్ మార్కెట్‌లో కూడా హిట్ కొట్టిందీ సంస్థ. ఈ సంస్థ ఏర్పాటు వెనుకాల చాలా స్టోరీ ఉంది
ఇద్దరు పోరగాళ్లు... లంచ్ కోసం ఓ కేఫ్‌కు వెళ్లారు. ఫుల్ రష్ ఉంది. ఎక్కడో చోట హడావుడిగా తినేసి బయట పట్టారు. వాళ్లకు మెనూ చూసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంత రష్‌లో మెనూ చూసి... ఆర్డర్ ఇచ్చే టైం దొరకలేదు. భోజనం చేసి తర్వాత ఆఫీస్‌కు వచ్చారు. హోటల్‌లో మెనూ అక్కడ జరిగిన హైడ్రామాను సరదాగా స్నేహతులతో పంచుకున్నారు. పక్కనే కూర్చొన్న ఇద్దరు వ్యక్తులు అది విని... ఇలా ఎందుకు లైన్‌లో నిలబడాలి... మనం కూర్చున్న చోట నుంచే ఆర్డర్ ఇచ్చేందుకు స్కోప్ లేదా అని ఆలోచించారు. అలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే నేటి జొమాటో.
కాలేజీ టైంలోనే పిజ్జా కోసం క్యూలైన్‌లో నిలబడి విసుగెత్తిపోయిన సంగతి కూడా గుర్తు చేసుకున్నాడో వ్యక్తి. అందుకే ఇలాంటి క్యూ బాధలు తొలిగి ఆకలి తీర్చేందుకు ఫుడ్ మెనూలన్నింటినీ డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్న చేశారు. ఆ ఆలోచనతో మొదలైనా జొమాటో కెరీర్ స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో చరిత్ర సృష్టించిన వరకు సాగింది. 2008లో ఈ జొమాటో ఆరంభానికి ఆలోచన చేసిన ఈ ఇద్దరి స్నేహితులే దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా.
ఫుడ్ మెనూలన్నింటినీ ఓ చోట చేర్చాలన్న ఆలోచన వచ్చిన వెంటనే సమీపంలోని హోటల్స్ మెనూల వేటలో పడ్డారు. వాటన్నింటిని స్కాన్ చేసి కంపెనీ ఇంట్రానెట్‌లో డైరెక్టరీ క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేసిన కొన్ని రోజుల్లోనే ట్రాఫిక్ భారీగా పెరిగింది. దీంతో ఆ వేదికను ఫుడీబే.కామ్‌గా మార్చి ఓ వెబ్‌సైట్‌గా తయారు చేశారు. సర్వీస్‌ను దిల్లీ వాసులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ కూడా జనాలు భారీగా ఈ పుడీబే.కామ్‌కు అలవాటు పడ్డారు. అక్కడ ఆదరణ చూసిన ఈ ఇద్దరు ఫ్రెండ్స్... ముంబయి, కోల్‌కతాకు కూడా సర్వీస్ ఎక్స్‌పాండ్ చేశారు.
ఫుడీబే.కామ్‌కు వస్తున్న అప్లాజ్ చేసిన ఇద్దరు స్నేహుతులు దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు ఉన్న ఫుడీబే.కామ్ పపేరు పెద్దగా ప్రజలను ఆకట్టుకులేకపోయిందని గ్రహించి పేరు మార్చాలని నిర్ణయానికి వచ్చారు. అందరికీ ఈజీగా గుర్తు పెట్టుకునేలా 2010లో జొమాటోగా నేమ్ ఛేంజ్ చేశారు. ఈ పేరును ‘జొమాటో.కామ్’ అనే యూఆర్‌ఎల్‌ను ఓ ప్రముఖ బ్రాండింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారట. భారత్‌లో ప్రతి వంటింట్లో ఉంటే ‘టొమాటో’ అనే పదంతో జొమాటో సరిపోలి ఉండడంతో దీన్ని కొనుగోలు చేసి ఫుడీబే.కామ్‌ను జొమాటోగా మార్చారు.
జొమాటో డెవలప్‌మెంట్‌ను పసిగట్టిన అనేక కంపెనీలు నిధులు అందించాయి. మొదటిసారి ‘ఇన్ఫోఎడ్జ్’ అనే సంస్థ 60 లక్షల నిధులు ఇచ్చింది. క్రమంగా ఈ సంస్థ 2010-2013 మధ్య 16.7 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి 57.9 శాతం వాటాల్ని సొంతం చేసుకుంది. తర్వాత 2013లో సెకోయా క్యాపిట్ నుంచి కూడా భారీగా నిధుల్ని వచ్చాయి. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్, వై క్యాపిటల్, అలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్, కోరా, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కూడా జొమాటోకు నిధులు సమకూర్చాయి.
2012లోనే జొమాటో తమ సర్వీస్‌ను విదేశాల్లో స్టార్ట్ చేసింది. తొలుత యూఏఈలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఖతార్, దక్షిణాఫ్రికా, యూకే, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్, శ్రీలంక, టర్కీ, బ్రెజిల్‌కు విస్తరించింది. ఈ జర్నీలో దాదాపు 12 సంస్థల్ని కొనుగోలు చేసి జొమాటో.
పబ్లిక్ ఇష్యూలో హిట్ కొట్టిన జొమాటో.. మరిన్ని రంగాలకు విస్తరించాలని చూస్తోంది. నిత్యావసర సరకుల డెలివరీని కూడా ప్రారంభించనుంది. ‘గ్రోఫర్స్’ పేరిట యాప్‌ను కూడా క్రియేట్ చేసింది. పబ్లిక్ ఇష్యూకు లభించిన భారీ ఆదరణతో వ్యవస్థాపకుడు సీఈఓ దీపిందర్ గోయల్ భారత్‌లోని బిలియనీర్ జాబితాలో చేరారు. ఆయన వ్యక్తిగత సంపద 650 మిలియన్ డాలర్లకు చేరింది.